Trump : కంపుకొడుతున్న ట్రంప్ మాటలు.. మోదీని బెదిరించానంటూ..!
Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా ఒకే మాట చెబుతూనే ఉంటారు—“ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆరు ప్రధాన యుద్ధాలను నేను ఆపాను” అని. వాటిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం కూడా ఉందంటూ పదే పదే వాఖ్యలు చేస్తున్నారు.
- By Kavya Krishna Published Date - 02:10 PM, Wed - 27 August 25

Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా ఒకే మాట చెబుతూనే ఉంటారు—“ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆరు ప్రధాన యుద్ధాలను నేను ఆపాను” అని. వాటిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం కూడా ఉందంటూ పదే పదే వాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే అనేకసార్లు ఖండించింది. “కాల్పుల విరమణకు మూడో వ్యక్తి జోక్యం అసలే లేదు. భారత్-పాక్ మధ్య జరిగిన చర్చల ఫలితంగానే ఉద్రిక్తతలు తగ్గాయి” అని ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది.
తాజాగా వాషింగ్టన్ డీసీ లోని వైట్ హౌస్ లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ట్రంప్ మళ్లీ అదే వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన—
“ఒక అద్భుతమైన వ్యక్తి, భారత ప్రధాని మోడీతో స్వయంగా ఫోన్ లో మాట్లాడాను. పాకిస్థాన్‌తో ఘర్షణలు పెరుగుతున్నాయని తెలుసుకున్నాను. అప్పటికే పరిస్థితి అణు యుద్ధానికి దారితీసేలా మారింది. వెంటనే మోడీతో పాటు పాక్ నేతలతో మాట్లాడాను. ‘మీరు ఘర్షణలు ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేస్తాను, భారీ సుంకాలు విధిస్తాను’ అని గట్టిగా చెప్పాను. ఫలితంగా ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది” అని పేర్కొన్నారు.
Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా
ఈ వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్రంగా స్పందించింది. “ఇది పూర్తిగా ట్రంప్ కల్పన మాత్రమే. భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో మూడో దేశం లేదా నాయకుడి జోక్యం అసలు లేదు” అని న్యూఢిల్లీలోని వర్గాలు మళ్లీ స్పష్టం చేశాయి. ట్రంప్ పదే పదే అదే వాఖ్యలను పునరావృతం చేయడం దౌత్య పరంగా అనుచితం అని భారత అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. బుధవారం నుంచి ట్రంప్ ప్రభుత్వం విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ చర్యతో అమెరికా మార్కెట్లో భారతీయ దిగుమతులు భారీగా దెబ్బతిననున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం—ఈ సుంకాల కారణంగా దాదాపు అన్ని ప్రధాన రంగాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.
అమెరికా వైఖరితో విసిగిపోయిన భారత్, ఇప్పుడు రష్యా, చైనా వంటి దేశాలతో ఆర్థిక సంబంధాలు బలపరుచుకుంటోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటున్న భారత్, ఇప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్-చైనా సంబంధాలు బలపడితే, అది భారత ఆర్థిక పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ట్రంప్ వ్యాఖ్యలు దౌత్యపరంగా అమెరికా-భారత్ సంబంధాలను మరింత దెబ్బతీయవచ్చని నిపుణుల అంచనా. భారత్‌పై విధించిన 50% సుంకాలు రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తగ్గించే అంశంగా మారాయి. భారత్ ఇప్పుడు రష్యా, చైనా వైపు మరింతగా మొగ్గు చూపడం ఆసియాలో జియోపాలిటికల్ సమీకరణలను మార్చే అవకాశముంది.
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు