Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా
Telangana Cabinet : అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏర్పడిన కమిషన్ నివేదికను కూడా ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించనున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు, సూచనలు, సవరణలు వంటి విషయాలపై చర్చ జరగనుంది
- By Sudheer Published Date - 10:00 AM, Wed - 27 August 25

తెలంగాణలో మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) వాయిదా పడింది. తొలుత ఈనెల 29న జరగాల్సిన సమావేశాన్ని ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తూ 30న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం ఒక గంటకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అదే రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. దీంతో క్యాబినెట్ భేటీకి ప్రాధాన్యం మరింత పెరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఆ ప్రక్రియను ఏ విధంగా అమలు చేయాలి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏర్పడిన కమిషన్ నివేదికను కూడా ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించనున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు, సూచనలు, సవరణలు వంటి విషయాలపై చర్చ జరగనుంది. దీంతో రాబోయే ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాల దిశలో ఈ క్యాబినెట్ భేటీ కీలక మలుపుగా భావిస్తున్నారు.