Most Influential People : ‘టైమ్’ టాప్-100 ప్రభావవంతమైన వ్యక్తులు వీరే..
సికిల్ సెల్ వ్యాధికి చికిత్స చేసే CRISPR ఆధారిత జన్యు సవరణ చికిత్స కోసం తొలిసారిగా ఆమె సారథ్యంలోని వెర్టెక్స్(Most Influential People) కంపెనీ అమెరికా ఎఫ్‌డీఏ FDA నుంచి అనుమతులు పొందింది.
- By Pasha Published Date - 10:29 AM, Thu - 17 April 25

Most Influential People : ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ‘టైమ్’ మ్యాగజైన్ విడుదల చేసింది. దీనిలో ఒక్క భారతీయుడికి కూడా చోటు దక్కలేదు. అయితే భారత సంతతికి చెందిన రేష్మా కేవల్రమణికి ఈ లిస్టులో చోటు దక్కింది. ఆమె వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. 11 సంవత్సరాల వయసులో రేష్మా భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలోని ప్రముఖ బయోటెక్ కంపెనీకి సారథ్యం వహిస్తూ ఆమె ఖ్యాతిని గడించారు. సికిల్ సెల్ వ్యాధికి చికిత్స చేసే CRISPR ఆధారిత జన్యు సవరణ చికిత్స కోసం తొలిసారిగా ఆమె సారథ్యంలోని వెర్టెక్స్(Most Influential People) కంపెనీ అమెరికా ఎఫ్‌డీఏ FDA నుంచి అనుమతులు పొందింది. ఇది జన్యు వైద్యంలో ఒక మైలురాయి లాంటిది.
Also Read :Nallari Family : మాజీ సీఎం కిరణ్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీ.. స్కెచ్ అదేనా ?
టాప్-100లో ఉన్న ప్రముఖులు ఎవరు ?
- టైమ్ మ్యాగజైన్ టాప్-100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ఉన్నారు.
- బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్, త్వరలో జరగబోయే మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్న క్లాడియా షీన్‌బామ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్‌లకు ఈ లిస్టులో చోటు దక్కింది.
- సెరేనా విలియమ్స్, స్నూప్ డాగ్, గ్రెటా గెర్విగ్, ఎడ్ షీరాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ భార్య యులియా నావల్నాయలకు ఈ జాబితాలో చోటును కల్పించారు.
- ఇరాన్‌కు చెందిన సినీ నిర్మాత మహ్మద్ రసూలోఫ్, సిరియాను ప్రస్తుతం పాలిస్తున్న మిలిటెంట్ సంస్థ హయాత్ తహ్రీర్ అల్ షామ్ సారథి అహ్మద్ అల్ షారాల పేర్లను ఈ లిస్టులో చేర్చారు.
- విశ్వవిఖ్యాత బ్లాక్ రాక్ కంపెనీ సీఈఓ లారీ ఫింక్, ఫేస్ బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్‌లకు ఈ లిస్టులో చోటు లభించింది.
- వివిధ దేశాలతో తలపడే క్రమంలో అమెరికా ఆర్మీ, ఇంటెలీజెన్స్ విభాగాలకు సాంకేతిక సహకారాన్ని అందించే పలంటీర్ కంపెనీ సారథి అలెక్స్ కార్ప్ పేరు కూడా ఈ లిస్టులో ఉంది.