Three dead: సెంట్రల్ ప్యారిస్‌లో కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో కాల్పులు (shooting) వార్తలు కలకలం రేపుతున్నాయి. వార్తా సంస్థ AFP ప్రకారం.. సెంట్రల్ పారిస్‌లో కాల్పులు(shooting) జరిగాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా పలువురు గాయపడినట్లు సమాచారం.
- By Gopichand Published Date - 10:28 AM, Sat - 24 December 22
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో కాల్పులు (shooting) వార్తలు కలకలం రేపుతున్నాయి. వార్తా సంస్థ AFP ప్రకారం.. సెంట్రల్ పారిస్‌లో కాల్పులు(shooting) జరిగాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా పలువురు గాయపడినట్లు సమాచారం. స్థానిక మీడియా ప్రకారం.. పోలీసులు అనుమానిత 60 ఏళ్ల దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. నేరానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Fire in Russia: రష్యాలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని కుర్దిష్ సెంటర్లో కాల్పుల ఘటన తర్వాత ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అదే సమయంలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో కొంత మంది గాయపడ్డారు. పారిస్‌లో కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టపగలు కాల్పులు జరపడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనల అనంతరం పారిస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ALERTE – Fusillade à Paris : plusieurs blessés dans le 10eme arrondissement.
Police sur place. Un suspect interpelé. pic.twitter.com/mbQFl2a0vf
— Clément Lanot (@ClementLanot) December 23, 2022
Related News
Alejandra Rodríguez: మిస్ యూనివర్స్‌గా 60 ఏళ్ల భామ.. ఎవరీ అలెజాండ్రా రోడ్రిగ్జ్..?
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతిచోటా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 గురించి చర్చ జరుగుతోంది. ఈ టైటిల్‌ను అర్జెంటీనాలోని లా ప్లాటా నివాసి అలెజాండ్రా రోడ్రిగ్జ్ గెలుచుకున్నారు.