Nude Photo Shoot: 2500 మందితో నగ్న ఫొటోషూట్.. కారణమిదే..?
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంతమంది వినూత్న కార్యక్రమం చేపట్టారు.
- Author : Gopichand
Date : 26-11-2022 - 4:18 IST
Published By : Hashtagu Telugu Desk
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంతమంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద వీరంతా సందడి చేశారు. కాగా ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువ. అక్కడ చిన్న,పెద్ద తేడా లేకుండా అనేకమంది ఈ రోగంతో పోరాడుతున్నారు. దీంతో అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు.
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల ఆస్ట్రేలియాలో చట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరంతా క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ఇలా న్యూడ్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు.