HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Then Clinton With The Employee Now Trump With The Porn Star

US Former President Donald Trump: అప్పుడు ఉద్యోగినితో క్లింటన్.. ఇప్పుడు పోర్న్‌ స్టార్‌తో ట్రంప్..!

అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అప్పట్లో బిల్ క్లింటన్ కూడా వైట్‌హౌస్‌ ఉద్యోగిని మోనికా లెవిన్‌స్కీ‌తో రాసలీలు సాగించారనే ప్రచారం జరిగింది. ఆ ఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది.

  • Author : Gopi Date : 05-04-2023 - 1:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US Former President Donald Trump
Resizeimagesize (1280 X 720) (4)

అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అప్పట్లో బిల్ క్లింటన్ కూడా వైట్‌హౌస్‌ ఉద్యోగిని మోనికా లెవిన్‌స్కీ‌తో రాసలీలు సాగించారనే ప్రచారం జరిగింది. ఆ ఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది. ఇప్పుడు పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌తో నెరిపిన వ్యవహారం కారణంగా డొనాల్డ్ ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016లో మౌనంగా ఉండేందుకు ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు చెల్లించారనే ఆరోపణలపై మాన్‌హాటన్ గ్రాండ్ జ్యూరీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి దేశ మాజీ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. ట్రంప్‌ కంటే ముందే అమెరికా మాజీ అధ్యక్షులు రిచర్డ్‌ నిక్సన్‌, బిల్‌ క్లింటన్‌లు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నందున న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

న్యూయార్క్‌లోని రిపబ్లికన్ పార్టీ అధినేత ట్రంప్ 2016లో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు US $ 130,000 చెల్లింపునకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఆరోపించిన ఎఫైర్ గురించి మౌనంగా ఉండటానికి డబ్బు చెల్లించడంలో ట్రంప్ పాత్రపై నేరారోపణ చేయడానికి గ్రాండ్ జ్యూరీ పూనుకుంది.

రిచర్డ్ నిక్సన్‌పై కూడా ఆరోపణలు

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌పై కూడా లంచం ఆరోపణలు వచ్చాయి. 1974లో వాటర్‌గేట్ కుంభకోణంలో రిచర్డ్ నిక్సన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, నిక్సన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొద్ది వారాలకే అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ అతనికి క్షమాపణ చెప్పారు.

బిల్ క్లింటన్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు

2001లో బిల్ క్లింటన్ కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ ఇంటర్న్ మోనికా లెవిన్స్కీని వేధించాడని క్లింటన్ పై ఆరోపించారు. ఆ ఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది.

Also Read: Earthquake: కోస్టారికా, పనామాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదు..!

2006లో లేక్‌తాహో హోటల్‌లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌ ఇటీవల వెల్లడించి ప్రకంపనలు రేపారు. ట్రంప్‌తో తన సంబంధాన్ని ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా బయట పెట్టింది. ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచేందుకు ట్రంప్‌ వ్యక్తిగత అడ్వొకేట్‌ మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారు. డేనియల్స్‌కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు కోహెన్ అంగీకరించాడు. ఇప్పుడు ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. కాగా.. ఈ కేసులో తానే తప్పు చేయలేదని ట్రంప్‌ అంటున్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో తనను పోటీ చేకుండా నిలువరించేందుకు జరుగుతున్న కుట్రగా ఆయన పేర్కొంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Donald Trump
  • US Former President Donald Trump
  • US Former Presidents
  • world news

Related News

Donald Trump

Donald Trump: ఇరాన్ డీల్‌ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ

  • Iran Closes Airspace; US Warns of Attacks

    Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd