US : అమ్మాయిని హత్యచేసిన మైనర్ బాలుడు.ఈ డెడ్ బాడీ ఏం చేయాలో ఐడియా ఇవ్వడంటూ సోషల్ మీడియాలో పోస్ట్..!!
- Author : hashtagu
Date : 28-11-2022 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలుడు ఓ అమ్మాయిని హత్య చేశాడు. అనంతరం వీడియో తీసి సోషల్ మీడియాలో చేశాడు. ఈ డెడ్ బాడీని ఏం చేయాలో కాస్త ఐడియా ఇవ్వడంటూ వీడియో తీసి మరి పోస్టు చేశాడు. దీంతో ఆ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ అబ్బాయి తన ఇంట్లోనే అమ్మాయిని కాల్చి చంపాడు. వీడియోలో కూపర్ చనిపోయిన అమ్మాయిని చూపిస్తూ…ఈ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా క్లూ ఇవ్వండి అంటూ వీడియో చెప్పడం కలకలం రేపింది.
Is it not strange that they are showing the juvenile but not ever juvies who murder in Philly?https://t.co/gyEjaXdbxm
— Sic Semper Tyrannis 🇺🇸 (@Semper_Doodle) November 28, 2022
నిందితుడు కూపర్ బెన్సలాంలో రిడ్జ్ ట్రైలర్ పార్క్ లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ అమ్మాయిని ఎందుకు చంపాడు అనే దానిపై స్పష్టత లేదు.