Trump Team Assets: ట్రంప్ అండ్ టీమ్ ఆస్తులు రూ.32.41 లక్షల కోట్లు.. 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువే!
ఎలాన్ మస్క్ చేరికతో డొనాల్డ్ ట్రంప్ టీమ్(Trump Team Assets) మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ అయింది.
- By Pasha Published Date - 01:03 PM, Wed - 11 December 24

Trump Team Assets: జీడీపీ అంటే.. స్థూల దేశీయ ఉత్పత్తి. ఇది ప్రతీ దేశపు ఆర్థిక అభివృద్ధి ప్రయాణానికి ప్రమాణం. ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం తమ జీడీపీ వివరాలను ప్రకటిస్తుంటాయి. ప్రపంచంలోని 172 దేశాల జీడీపీ కంటే అమెరికాలో కొలువుతీరనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కార్యవర్గంలోని ముఖ్యుల ఆస్తుల విలువే ఎక్కువట!! ట్రంప్ ప్రభుత్వంలో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధిపతిగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు బాధ్యతలను అప్పగించారు. ఎలాన్ మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ.32 లక్షల కోట్లు.
Also Read :Delhi Polls 2025 : కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
కొత్తగా ఏర్పడబోయే రిపబ్లికన్ పార్టీ సర్కారులోని ఇతర శ్రీమంతుల ఆస్తులన్నీ కలుపుకుంటే.. ట్రంప్ క్యాబినెట్ సభ్యులందరి మొత్తం ఆస్తుల విలువ రూ.32.41 లక్షల కోట్లకు చేరుతుంది. ప్రపంచంలోని 172 దేశాల జీడీపీలు అన్నీ కలుపుకున్నా.. ఇంతకు విలువ చేయవు. ఇక 2016 సంవత్సరంలో అమెరికాలో ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వ మంత్రిమండలిలోని సభ్యుల ఆస్తుల విలువ కేవలం రూ.52వేల కోట్లే. ఎలాన్ మస్క్ చేరికతో డొనాల్డ్ ట్రంప్ టీమ్(Trump Team Assets) మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ అయింది. ఎన్నికల టైంలోనూ ట్రంప్ ప్రచారానికి వేల కోట్ల విరాళాలను ఎలాన్ మస్క్ అందజేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ సాదాసీదా వ్యక్తేం కాదు. ఆయనకు రియల్ ఎస్టేట్, హోటల్స్, సోషల్ మీడియా వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్‌కు దాదాపు రూ.52వేల కోట్ల సంపద ఉంది.
Also Read :Samantha Prayer 2025 : నూతన సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు.. సమంత పోస్ట్ వైరల్
- బ్రిటన్‌కు అమెరికా రాయబారిగా ట్రంప్ ప్రతిపాదించిన వారెన్ స్టీఫెన్స్‌కు దాదాపు రూ.25వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- కాబోయే అమెరికా విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌కు రూ.30వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- నాసా అడ్మినిస్ట్రేటర్‌గా ట్రంప్ ఎంపిక చేసిన జరాడ్ ఇస్సాక్‌మన్‌కు రూ.15వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- కాబోయే వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్‌కు రూ.12వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- డిపార్ట్‌మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫీషియన్సీలో మస్క్‌తో కలిసి పనిచేయనున్న వివేక్‌రామస్వామి ఆస్తి విలువ దాదాపు రూ.8వేల కోట్లు.
- మిడిల్ ఈస్ట్‌కు ప్రత్యేక ప్రతినిధిగా ట్రంప్ నియమించిన స్టీవెన్ విట్‌కాఫ్‌కు రూ.8వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటీరియర్‌కు నేతృత్వం వహించనున్న డౌగ్ బర్గమ్‌కు రూ.8వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.