Singapore President: సింగపూర్ 9వ అధ్యక్షునిగా థర్మన్ షణ్ముగరత్నం.. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆధిపత్యం..!
సింగపూర్ అధ్యక్షుడి (Singapore President) గా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేశారు.
- Author : Gopichand
Date : 15-09-2023 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
Singapore President: సింగపూర్ అధ్యక్షుడి (Singapore President) గా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) గురువారం (సెప్టెంబర్ 14) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సింగపూర్‌కు 9వ అధ్యక్షుడయ్యారు. అధ్యక్షురాలు హలీమా యాకోబ్ పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగిసింది. ఈ పరిస్థితిలో థర్మన్ షణ్ముగరత్నం అధ్యక్షుడిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గతంలో సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో 66 ఏళ్ల షణ్ముగరత్నం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. అతను చైనాకు చెందిన కోక్ సాంగ్, టాన్ కిన్ లియాన్‌లను భారీ తేడాతో ఓడించాడు. కోక్‌కు 15.2 శాతం ఓట్లు రాగా, టాన్‌కు 13.88 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో షణ్ముగరత్నంకు 70.4 శాతం అంటే 17 లక్షల 46 వేల 427 ఓట్లు వచ్చాయి. సెప్టెంబర్ 1న సింగపూర్‌లో అధ్యక్ష పదవికి ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
Also Read: Kim Jong Un – Putin : ఉత్తరకొరియాకు రష్యా ఆ టెక్నాలజీని ఇవ్వబోతోందట !
భారతీయుల ఆధిపత్యం పెరుగుతోంది
ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భారత జెండాను ఎగురవేస్తున్న భారతీయుల జాబితాలో ధర్మన్ షణ్ముగరత్నం కూడా చేరిపోయారు. ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచ రాజకీయాల్లో భారతీయుల ఆధిపత్యం నిరంతరం పెరుగుతోంది. అమెరికా, ఇంగ్లండ్‌తో సహా 15 దేశాల్లో 200 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు నాయకత్వ పదవిలో ఉన్నారు. వీరిలో 60 మంది కేబినెట్ మంత్రుల వరకు పదవులు కలిగి ఉన్నారు.
థర్మన్ తమిళనాడు నుంచి వెళ్లిన తర్వాత సింగపూర్‌లో పెరిగారు
ఇంతకు ముందు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, అమెరికన్ ఎంపీ రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జైపాల్, శ్రీ తానేదార్ ఇలా చాలా మంది భారతీయుల ప్రాభవాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి థర్మన్ షణ్ముగరత్నం పేరు కూడా చేరింది. అతని తాత 19వ శతాబ్దంలో తమిళనాడు నుండి వలస వెళ్లి సింగపూర్‌లో స్థిరపడ్డారు. అక్కడ తమిళ జనాభా తొమ్మిది శాతంగా ఉంది.