HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Terrorist Sneaks Into India For Baldness Treatment

Terrorist Hair Transplant: బట్టతల ట్రీట్‌మెంట్ కోసం భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాది

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2026 - 3:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Terrorist Mohammad Usman sneaks into India for baldness treatment.
Terrorist Mohammad Usman sneaks into India for baldness treatment.

పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హెయిర్ ప్లాంటేషన్ కోసం తన ఉగ్రదాడిని వాయిదా వేసుకున్న ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ కేసు విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నివ్వెరపోయారు. జమ్ము కశ్మీర్ పోలీసులు గత నెల జరిపిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసి, దర్యాప్తు కోసం ఎన్ఐఏకు అప్పగించారు.

ఎన్ఐఏ అధికారులు ఇటీవల ఉస్మాన్‌ జాట్ ను విచారించగా నివ్వెరపోయే విషయం వెలుగు చూసింది. లాహోర్‌కు చెందిన ఉస్మాన్ లష్కరే ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం సరిహద్దు దాటి కశ్మీర్ లోయలోకి జొరబడ్డాడు. జమ్ము కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ విచారణలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది.

తనకు జుత్తు ఊడిపోవడంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నానని, దీంతో తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అతను అధికారులకు తెలియజేశాడు. మరో ఉగ్రవాది అబు హురెయిరా సహాయంతో చికిత్స తీసుకున్నట్లు అతడు విచారణలో తెలిపాడు. శ్రీనగర్‌లోని ఒక క్లినిక్‌లో ఉస్మాన్ జాట్ రహస్యంగా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు. కొన్నిసార్లు రాత్రంతా క్లినిక్‌లోనే ఉన్నట్లు చెప్పాడు.

చికిత్స పూర్తయ్యాక ఉస్మాన్ జాట్ జమ్మూకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో పంజాబ్ చేరుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతడు నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు కోసం ప్రయత్నించాడు. వాటి సాయంతో దేశం విడిచి పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఉత్తర కశ్మీర్, శ్రీనగర్‌లో లష్కరే అనుబంధంగా పనిచేస్తున్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ నెట్ వర్క్‌ను పోలీసులు ఛేదించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hair Transplant
  • jammu kashmir
  • Lashkar-e-Taiba terrorist
  • Mohammad Usman
  • pakistan
  • terrorist

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd