1000 Killed : 2 రోజుల్లో 1000 మంది మృతి.. రోడ్లపై డెడ్‌బాడీలు.. సిరియాలో మళ్లీ నరమేధం
బషర్ అల్ అసద్‌కు(1000 Killed) మద్దతు పలికే వర్గాలు అత్యధికంగా నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.
- By Pasha Published Date - 08:09 AM, Sun - 9 March 25

1000 Killed : సిరియాలో మళ్లీ రక్తం ఏరులై పారింది. గత రెండు రోజుల్లో 1000 మందికిపైగా చనిపోయారు. 2024 డిసెంబరులో సిరియాను వదిలి రష్యాకు పరారైన మాజీ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, ప్రస్తుతం సిరియాను పాలిస్తున్న మిలిటెంట్ల గ్రూప్ మధ్య భారీస్థాయిలో ఘర్షణలు జరిగాయి. దీంతో సిరియాలోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. రష్యాలో ఉంటున్న అసద్ అక్కడి నుంచే తన వర్గీయులను ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సిరియాపై పట్టు సాధించిన మిలిటెంట్ల గ్రూపునకు అమెరికా, టర్కీ, బ్రిటన్‌ల నుంచి ఆయుధాలు అందుతున్నాయి. 14 ఏళ్ల క్రితం సిరియాలో జరిగిన అంతర్యుద్ధం తర్వాత.. అక్కడ జరిగిన అత్యంత పాశవిక హింసాకాండ ఇదేనని మానవ హక్కుల సంఘాలు ప్రకటించాయి. చనిపోయిన వారిలో 745 మంది సాధారణ ప్రజలు, 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది బషర్ అల్ అసద్ మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించాయి.
Also Read :Mobile phone : మీరు నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా?..నష్టాలివే..!
ఆ పట్టణాల్లో దారుణ పరిస్థితి
- బషర్ అల్ అసద్‌కు(1000 Killed) మద్దతు పలికే వర్గాలు అత్యధికంగా నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.
- తాజా ఘర్షణల కారణంగా సిరియాలోని బనీయాస్ పట్టణంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి.అక్కడి వీధులు, భవనాలపైనా డెడ్‌బాడీలు పడి ఉన్నాయని తెలిసింది. కనీసం వాటిని ఖననం చేయకుండా ప్రత్యర్ధి వర్గం అడ్డుకుంటోందని సమాచారం.
- సిరియాలోని లతాకియాలో విద్యుత్ సరఫరా, తాగునీటి పంపిణీ ఆగిపోయింది.
- ఇళ్లలోకి వెళ్లి తొలుత పురుషులను కాల్చి చంపుతున్నారట. అనంతరం ఆయా ఇళ్లను దోచుకుంటున్నారట.
- బషర్ అల్ అసద్ కుటుంబం సిరియాను దాదాపు ఐదు దశాబ్దాలు పాలించింది. బాగా డబ్బును సంపాదించింది. దాన్ని రష్యాలోని బ్యాంకులకు తరలించింది.
- కానీ సిరియాలో మిగిలిపోయిన అసద్ వర్గీయులు మాత్రం నరకాన్ని చూడాల్సి వస్తోంది.
- బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా 2011లో సిరియాలో తిరుగుబాటు మొదలైంది. తొలినాళ్లలో అసద్‌కు రష్యా, ఇరాన్ సైనిక సహకారం లభించింది.
- చివరకు 2024 నవంబరులో సిరియాపై మిలిటెంట్లకు పట్టు వచ్చింది.అమెరికా, టర్కీ, బ్రిటన్‌ల నుంచి భారీ సైనిక సాయం అందడంతో ఇది సాధ్యమైంది.