సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య
- Author : Vamsi Chowdary Korata
Date : 05-03-2026 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk

Nancy Grewal, Punjabi-origin YouTuber in Canada
‘ఖల్సా బాక్స్’ కథనం ప్రకారం.. నాన్సీ గ్రెవాల్ పంజాబీ ప్రవాస సమాజంలో మంచి గుర్తింపు ఉన్న యూట్యూబర్. పంజాబ్ సమస్యలు, భారత రాజకీయాలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌తో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద భావజాలాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించేవారు. గురుద్వారాలను వేర్పాటువాద ప్రచారం కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టేవారు. సమస్యలుంటే భారత్‌లోనే పరిష్కరించుకోవాలని, విదేశాల నుంచి విద్వేషం రెచ్చగొట్టవద్దని ఆమె హితవు పలికేవారు.
ఈ ఘటనపై లాసెల్ పోలీసులు స్పందిస్తూ.. దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి దీనిని ఒక ‘ఐసోలేటెడ్’ (వ్యక్తిగత లేదా అరుదైన) ఘటనగానే పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. నాన్సీ గ్రెవాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. నాన్సీ హత్యతో కెనడాలోని స్థానిక పంజాబీ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.