Trump Swearing In : ఎల్లుండి రోటుండాలో ట్రంప్ ప్రమాణస్వీకారం.. రోటుండాలో ఎందుకు ?
భారీ ధరను చెల్లించి మరీ నగరంలోని హోటళ్లలో(Trump Swearing In) బస చేశారు.
- Author : Pasha
Date : 18-01-2025 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Swearing In : అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (78) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయాల్సిన వేదిక మారింది. సాధారణంగానైతే వాషింగ్టన్ డీసీ నగరంలోని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట ప్రమాణ స్వీకార ఘట్టం జరుగుతుంది. కానీ ఈసారి క్యాపిటల్ భవనం లోపల ఉండే గోళాకార సముదాయం(రోటుండా)లో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. సోమవారం రోజున(జనవరి 20న) వాషింగ్టన్ డీసీలో సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉండొచ్చనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా 1985 జనవరి 20న అమెరికాలో దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోటుండా సముదాయంలో జరిగింది. అప్పట్లో మైనస్ 14 డిగ్రీలసెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read :Local Body Elections 2025 : స్థానిక సంస్థల పోల్స్ ఎప్పుడు ? ఫిబ్రవరి నెలాఖరులోనేనా ?
ప్రమాణ స్వీకార వేదిక మారిన తరుణంలో కాబోయే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆర్కిటిక్ ప్రాంతం వైపు నుంచి వాషింగ్టన్ దిశగా బలమైన చలిగాలులు వీస్తున్నాయి. నా ప్రమాణ స్వీకారం వేళ (జనవరి 20న) వేలాది మంది అనుచరులు, భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాలని నేను కోరుకోవడం లేదు’’ అని ఆయన తెలిపారు.
Also Read :Anil Ravipudi : నేను సినిమాలు ఇలాగే తీస్తా.. ట్రోలర్స్ కి అనిల్ రావిపూడి కౌంటర్
వాస్తవానికి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది ట్రంప్ అభిమానులు ఇప్పటికే వాషింగ్టన్‌కు చేరుకున్నారు. భారీ ధరను చెల్లించి మరీ నగరంలోని హోటళ్లలో(Trump Swearing In) బస చేశారు. అకస్మాత్తుగా ప్రమాణ స్వీకార వేదిక మారడంతో వారంతా గందరగోళంలో పడ్డారు. మరోవైపు వాషింగ్టన్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. క్యాపిటల్ భవనం చుట్టూ వివిధ అంచెల్లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని దాటితేనే వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి ప్రవేశించగలరు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా తమ యాక్టివిటీని ముమ్మరం చేశారు.