Rocket strikes from Syria: టర్కీపై సిరియా ప్రతిదాడులు.. ముగ్గురు మృతి..!
టర్కీపై సిరియా క్షిపణులతో విరుచుకుపడుతోంది.
- By Gopichand Published Date - 09:13 PM, Mon - 21 November 22
టర్కీపై సిరియా క్షిపణులతో విరుచుకుపడుతోంది. టర్కీ సరిహద్దు పట్టణమైన కర్కామిస్పై జరిపిన దాడిలో ఒక చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు అక్కడి మంత్రి ఒకరు వెల్లడించారు. ఆదివారం సిరియాలోని ఉగ్ర స్థావరాలపై టర్కీ దాడులు చేయడంతో.. సోమవారం సిరియా ప్రతిదాడి చేసింది. సిరియా ఐదు రాకెట్లు ప్రయోగించగా.. వాటిలో ఒకటి పాఠశాలను ఢీకొట్టింది. రాకెట్ దాడుల్లో ఆరుగురికి మందికి గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
“కర్కామిస్పై ఐదు రాకెట్లు దూసుకురావడంతో ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.” అని ఆగ్నేయ గాజియాంటెప్ ప్రావిన్స్ గవర్నర్ దావత్ గుల్ ట్విట్టర్లో తెలిపారు. ఉత్తర సిరియా.. ఇరాక్‌లోని చట్టవిరుద్ధమైన కుర్దిష్ మిలిటెంట్ల స్థావరాలపై టర్కీ ఆదివారం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆరుగురు పోలీసులు, ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఉత్తర, ఈశాన్య సిరియాలో జరిగిన దాడుల్లో కనీసం 31 మంది మరణించారని బ్రిటిష్ ఆధారిత పర్యవేక్షణ బృందం సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. అయితే.. నవంబర్ 13న ఇస్తాంబుల్ నగరంలోని పర్యాటకుల షాపింగ్ కేంద్రమైన ఇస్తిక్లాల్ వద్ద జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడుల వెనుక పీకేకే, వైపీజీల హస్తం ఉందని తుర్కియే ఆరోపించింది. ఆ దాడుల్లో తమ పాత్ర లేదని అవి ఖండించాయి.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.