HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prakash Rajs Name In The Dharmasthala Case

Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Complaint filed against actor Prakash Raj at the police station.
Complaint filed against actor Prakash Raj at the police station.

కర్ణాటకలో సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ ఆరోపణలపై మరో రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. కర్ణాటక హైకోర్టులో దాఖలైన ఒక రిట్ పిటిషన్‌లో తన పేరు రావడంతో, ఈ వివాదంపై ఆయన స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా కన్నడలో ఒక ప్రకటన విడుదల చేశారు. “ధర్మస్థల కేసుకు సంబంధించి మీడియా, సామాజిక మాధ్యమాల్లో నా గురించి జరుగుతున్న చర్చను గమనించాను. ఇది అత్యంత సున్నితమైన విషయం, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. కాబట్టి, ఈ సందేహాలపై స్పందించడం నా బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, మరో రెండు రోజుల్లో నేరుగా మీడియా సమక్షంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అప్పటి వరకు గాలి వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. కొందరు వ్యక్తులు ఈ అంశంపై ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలను విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేసు నేపథ్యం ఏమిటి?

ధర్మస్థల ఆలయ పట్టణ పరిసరాల్లో గత రెండు దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను ఖననం చేశారని, ఆ సమయంలో తనపై ఒత్తిడి తెచ్చారని గత ఏడాది (2025) ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడటంతో ఈ కేసు తీవ్రరూపం దాల్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ, అందులో ప్రకాశ్ రాజ్ పేరును ప్రస్తావించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Prakash Raj
  • Dharmasthala
  • Dharmasthala Incident
  • Dharmasthala Mystery
  • karnataka high court
  • SIT Investigation

Related News

Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

తెలంగాణలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై నిపుణుల కమిటీ సమగ్ర ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వ

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd