HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Rishi Sunak Warns After Taking Charge As Uk Pm

UK PM Rishi Sunak: ప్రధాని రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు.. ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాం..!

బ్రిటన్​ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​.. మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.

  • Author : Gopi Date : 25-10-2022 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rishi Sunak

బ్రిటన్​ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​.. మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​-3 అనుమతి తీసుకున్న అనంతరం ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. కోవిడ్ -19 పరిణామాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాల కొరతను సృష్టించిందని ఆయన అన్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే తన లక్ష్యమని ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ‘‘పారదర్శక పాలన అందిస్తా. అనుకుంటే మనం అద్భుతాలు సాధించగలం. బ్రిటన్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమిస్తాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని వెల్లడించారు. యూకే ప్రజల ఉన్నతి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తామని ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.

‘‘కన్జర్వేటివ్‌ పార్టీ ప్రతిదశలో జవాబుదారీతనంతో పనిచేస్తుంది. అందరితో కలిసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తాం. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని రిషి సునాక్‌ పేర్కొన్నారు. 45 రోజుల పాటు ప్రధాని పదవిలో ఉన్న తర్వాత లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Difficult Decisions
  • rishi sunak
  • UK PM
  • UK PM Rishi Sunak
  • world news

Related News

    Latest News

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

    • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd