HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Pm Modi Speaks To Italys Georgia Meloni

PM Modi- Meloni: ఉక్రెయిన్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీతో పీఎం మోదీ చర్చలు!

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.

  • Author : Gopichand Date : 10-09-2025 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi- Meloni
PM Modi- Meloni

PM Modi- Meloni: ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత మార్గమే ఏకైక పరిష్కారమని మోడీ గతంలోనూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ (PM Modi- Meloni)తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరు నేతలు ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి అంగీకరించారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దీనితో పాటు రక్షణ, భద్రత, సైన్స్, విద్య, అంతరిక్షం, ఉగ్రవాద నిరోధం వంటి రంగాలలో సహకారంపై చర్చించారు.

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ప్రధాని మోదీ, మెలోనీ మధ్య జరిగిన సంభాషణలో వాణిజ్య సంబంధాలపైనా చర్చ జరిగింది. భారత-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India-EU Free Trade Agreement), 2026లో జరగబోయే ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు ఇటలీ ప్రధాని మెలోనీ తన మద్దతును ప్రకటించారు. అలాగే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEEEC)ను ప్రోత్సహించడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.

Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా

ఉక్రెయిన్ శాంతిపై చర్చ

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై మోదీ, మెలోనీ మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. 2025-29 మధ్య సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవసరమని నొక్కి చెబుతూ భారతదేశం ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు.

ఎక్స్ (X)లో పీఎం మోదీ ప్రకటన

ఇటలీ ప్రధాని మెలోనీతో మాట్లాడిన తర్వాత పీఎం మోదీ ఈ విషయాన్ని తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు. “ప్రధాని జార్జియా మెలోనీతో చాలా మంచి సంభాషణ జరిగింది. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే మా సంయుక్త నిబద్ధతను పునరుద్ఘాటించాము. ఉక్రెయిన్ సంఘర్షణను వీలైనంత త్వరగా ముగించాలనే ఉమ్మడి ఆసక్తిని వ్యక్తం చేశాం” అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూర్చే భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందానికి తుది రూపం ఇవ్వడానికి, IMEEEC చొరవ ద్వారా కనెక్టివిటీని పెంచడానికి ఇటలీ చురుకైన సహకారం అందిస్తున్నందుకు ప్రధాని మెలోనీకి ధన్యవాదాలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • PM Georgia Meloni
  • pm modi
  • PM Modi- Meloni
  • Ukraine conflict
  • world news

Related News

Modi- Trump

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!

భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.

  • Trump With Nobel Award

    ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

  • Iran

    ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

  • Iran Protests

    ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Pax Silica

    ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?

Latest News

  • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

  • భార‌త మార్కెట్లోకి మ‌రో కొత్త కారు.. జ‌న‌వ‌రి 21న లాంచ్‌!

  • ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

  • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

  • మీరు ఏ వైపు తిరిగి ప‌డుకుంటున్నారు?

Trending News

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

    • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

    • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd