crash landing: ల్యాండ్ అవుతుండగా కూలిన విమానం.. వీడియో వైరల్..!
అమెరికాలోని టెక్సాస్‌లో అత్యాధునిక యుద్ధ విమానం ల్యాండ్ (landing) అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఫైటర్ జెట్ F-35B గురువారం టెక్సాస్‌లో ల్యాండ్ (landing) అవుతుండగా ఈ ఘటన జరిగింది.
- By Gopichand Published Date - 09:00 PM, Fri - 16 December 22
అమెరికాలోని టెక్సాస్‌లో అత్యాధునిక యుద్ధ విమానం ల్యాండ్ (landing) అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఫైటర్ జెట్ F-35B గురువారం టెక్సాస్‌లో ల్యాండ్ (landing) అవుతుండగా ఈ ఘటన జరిగింది. విమానం నిలువుగా ల్యాండింగ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతుండగా యుద్ధ విమానం కూలింది. ఒక్కసారిగా రన్‌వేపై బొంగరంలాగా తిరిగింది. అమెరికా టెక్సాస్‌లోని నావల్ ఎయిర్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదం జరగగానే ఫైలట్ పారాచూట్ ద్వారా బయటకు వచ్చేశాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ శివ అరుర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన వీడియోను షేర్ చేస్తూ.. నేను టెక్సాస్‌లో గురువారం జరిగిన F-35B సంఘటన వీడియోను చూసినప్పుడు నేను చెప్పగలిగేది ఒక్కటే VTOL పైలట్‌లందరికీ హ్యాట్సాఫ్. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు అని రాసుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఉటాలోని వైమానిక దళ స్థావరం వద్ద F-35 ఫైటర్ జెట్ కూలిపోవడంతో పైలట్ తీవ్ర గాయాలు లేకుండా బయటపడ్డాడు.
Also Read: Shraddha Murder: కారాగారంలో నాకు రక్షణ కరువైంది.. బెయిల్ కోసం అఫ్తాబ్ ఏం చేశాడంటే..!
The only thing I can say when I watch this video capturing yesterday’s F-35B incident in Texas is hats off to all VTOL pilots. Pilot ejected safely here. pic.twitter.com/zMc5oCUja8
— Shiv Aroor (@ShivAroor) December 16, 2022