HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Pakistan To Evacuate 80000 People Ahead Of Cyclone Biparjoy

Biparjoy: పాకిస్థాన్ కు కూడా “బిపార్జోయ్” ముప్పు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పాక్ ఆర్మీ..!

అరేబియా సముద్రం నుంచి ఎగసిపడుతున్న బిపార్జోయ్ (Biparjoy) తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్ తీరాన్ని, పాకిస్థాన్‌లోని కరాచీ తీరాన్ని తాకనుంది.

  • Author : Gopi Date : 14-06-2023 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyclone Michaung
BiparJoy Cyclone Updates Urgent Meeting by Central Government

Biparjoy: అరేబియా సముద్రం నుంచి ఎగసిపడుతున్న బిపార్జోయ్ (Biparjoy) తుఫాను జూన్ 15న గుజరాత్‌లోని కచ్ తీరాన్ని, పాకిస్థాన్‌లోని కరాచీ తీరాన్ని తాకనుంది. బిపార్జోయ్ (Biparjoy) ముప్పును దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సైన్యాన్ని మోహరించారు.

పాకిస్థాన్ వాతావరణ శాఖ ఏం చెబుతోంది..?

పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం.. కరాచీ నుండి 140 కి.మీ దూరంలో సైక్లోన్ బిపార్జోయ్ ఉంది. కరాచీతో పాటు సింధ్ తీర ప్రాంతాలను బిపార్జోయ్ తాకే అవకాశం ఉంది. అయితే, దీని తీవ్రత జూన్ 17, 18 మధ్య తగ్గుతుంది. ఈ సమయం పాకిస్థాన్‌కు చాలా సవాల్‌గా ఉంది. 140-150 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 14 ఉదయం కరాచీకి దక్షిణంగా 470 కిలోమీటర్లు (292 మైళ్ళు) దూరంలో అరేబియా సముద్రంలో బిపార్జోయ్ ఉన్నట్లు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

Also Read: Cyclone Biparjoy: బిపార్జోయ్ ఎఫెక్ట్.. గుజరాత్‌లో హై అలర్ట్.. 30,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు..!

సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

సైక్లోన్ బిపార్జోయ్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా, 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి సహాయం చేయాలని ఆర్మీ, నేవీకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. తట్టా, కేతి బందర్, సుజావల్, బాడిన్, తార్పార్కర్, ఉమర్‌కోట్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర ఆశ్రయాలకు పంపడానికి ఆర్మీ , నేవీ సహాయం తీసుకున్నారు.

పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ సమావేశం

తుపాను సన్నద్ధతపై జరిగిన సమావేశానికి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షత వహించారు. నిర్వాసిత కుటుంబాలకు ఆహారం, నివాసం, ఇతర సహాయాలు అందించాలని, ఆపదలో ఉన్న వారందరినీ తరలించేందుకు పూర్తి చేయాలని అధికారులను కోరారు. గత రెండు రోజుల్లో దాదాపు 45,000 మందిని తీరప్రాంత నగరాల నుంచి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూన్ 15న తుఫాను భూమిని తాకేలోపు మరో 35,000 మందిని తరలించాలని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Biparjoy
  • Cyclone Biparjoy
  • pakistan
  • world news

Related News

Ceasefire Deadline

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Ceasefire Deadline

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd