HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Nuclear Conspiracy Under The Guise Of A Ceasefire

Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

అణ్వాయుధాల తయారీలో యురేనియం శుద్ధి అనేది అత్యంత కీలకమైన ఘట్టం. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను పెంచుకోవడం ద్వారా అణు బాంబును తయారు చేయడానికి సిద్ధమవుతోందని అమెరికా ఎప్పటి నుంచో అనుమానిస్తోంది

  • Author : Sudheer Date : 08-04-2026 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump Next Target
Trump Next Target

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ మధ్య జరిగిన ఒక ఒప్పందం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) కోసం ఇరాన్ పంపిన పది పాయింట్ల డాక్యుమెంట్‌పై వస్తున్న వార్తలు అగ్రరాజ్య విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పంద పత్రంలో (Document) భాషా పరమైన వ్యత్యాసాలు ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) వెల్లడించిన కథనం ప్రకారం.. ఇరాన్ రూపొందించిన పార్సీ భాషా వెర్షన్‌లో “యురేనియం శుద్ధిపై మా హక్కును గుర్తించాలి” అనే అత్యంత కీలకమైన డిమాండ్ ఉంది. అయితే, అదే డాక్యుమెంట్ ఇంగ్లిష్ వెర్షన్‌లో మాత్రం ఈ పాయింట్‌ను చాకచక్యంగా పక్కన పెట్టారు. అంటే అమెరికాకు ఒకలా, ఇరాన్ ప్రజలకు మరోలా అర్థమయ్యేలా ఈ పత్రాన్ని రూపొందించడం వెనుక ఇరాన్ పెద్ద కుట్రే చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్‌ను బురిడీ కొట్టించారా?

అణు ఒప్పందాల విషయంలో ఎంతో కఠినంగా ఉండే డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ తన దౌత్య చాకచక్యంతో ‘ఫూల్’ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీకి ప్రాణాధారమైన యురేనియం అంశాన్ని ఇంగ్లిష్ కాపీలో మరుగున పరచడం ద్వారా ట్రంప్ యంత్రాంగాన్ని ఇరాన్ తప్పుదోవ పట్టించిందని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా ఈ ఇంగ్లిష్ డాక్యుమెంట్‌ను ప్రామాణికంగా తీసుకుని సంతకం చేసి ఉంటే, భవిష్యత్తులో ఇరాన్ పార్సీ డాక్యుమెంట్‌ను చూపిస్తూ యురేనియం శుద్ధిని చట్టబద్ధం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ ‘డబుల్ గేమ్’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.

యురేనియం కీలకం.. అణు యుద్ధ మేఘాలు

అణ్వాయుధాల తయారీలో యురేనియం శుద్ధి అనేది అత్యంత కీలకమైన ఘట్టం. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను పెంచుకోవడం ద్వారా అణు బాంబును తయారు చేయడానికి సిద్ధమవుతోందని అమెరికా ఎప్పటి నుంచో అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, సీజ్‌ఫైర్ ఒప్పందం ముసుగులో తన అణు ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని ఇరాన్ భావించినట్లు స్పష్టమవుతోంది. ఈ డాక్యుమెంట్ లీక్ అవ్వడంతో, ట్రంప్ టీమ్ ఇప్పుడు రక్షణలో పడింది. ఈ వివాదం అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేయడమే కాకుండా, మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు పెద్ద విఘాతంగా మారే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Associated Press Report
  • Donald Trump
  • Farsi vs English Document
  • Iran Ceasefire
  • nuclear weapons
  • Uranium Enrichment

Related News

$100,000 fee for H-1B again

H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

అమెరికాలో ఉద్యోగాలు ఆశించే విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే సంస్థలకు మళ్లీ గందరగోళం మొదలైంది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే, అదే కోర్టు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో, సదరు ఫీజును వసూలు చేసేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీ

  • US-Iran peace deal reached... Oil prices crash.

    కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

  • Trump agrees to US peace deal with Iran.

    Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

  • US retaliatory strikes on Iran

    Donald Trump: ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd