North Korea- South Korea: ఆ రెండు దేశాల మధ్య ముదురుతున్న వివాదం?!
అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హేగ్‌సెత్ ఇంతకుముందు మాట్లాడుతూ.. అమెరికా-దక్షిణ కొరియా కూటమి (Alliance) ప్రధాన లక్ష్యం ఉత్తర కొరియాను అడ్డుకోవడమే అని అన్నారు.
- By Gopichand Published Date - 03:21 PM, Sat - 8 November 25
North Korea- South Korea: దక్షిణ కొరియా- ఉత్తర కొరియా (North Korea- South Korea) మధ్య వివాదం పెరుగుతోంది. ఈ వివాదంలోకి అమెరికా ప్రవేశించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దక్షిణ కొరియాకు అమెరికా విమాన వాహక నౌక (Aircraft Carrier)ను పంపింది. అంతేకాకుండా దక్షిణ కొరియాతో కలిసి భద్రతా సమావేశం నిర్వహించింది. ఈ చర్యతో ఉత్తర కొరియా ఆగ్రహం చెందింది. ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద ప్రకటన చేసింది. ఉత్తర కొరియా రక్షణ మంత్రి నో క్వాంగ్ చోల్ శనివారం మాట్లాడుతూ.. తాము మరింత దూకుడు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన నేరుగా పెద్ద దాడి గురించి మాట్లాడారు. అమెరికా తన విమాన వాహక నౌకలను దక్షిణ కొరియాకు పంపిన తర్వాత మంత్రి నో ఈ ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగిన భద్రతా సమావేశంపై కూడా ఉత్తర కొరియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
శుక్రవారం నాడు ఉత్తర కొరియా తన తూర్పు తీరం నుండి సముద్రంలోకి ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా ప్రజలు, సంస్థలపై అమెరికా అనేక కొత్త ఆంక్షలు విధించినందున ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. సైబర్ మనీ లాండరింగ్‌లో (Cyber Money Laundering) ఉత్తర కొరియా పాల్గొంటున్నట్లు అమెరికా ఆరోపించింది.
Also Read: India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే.. పాక్ కష్టమే!
అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హేగ్‌సెత్ ఇంతకుముందు మాట్లాడుతూ.. అమెరికా-దక్షిణ కొరియా కూటమి (Alliance) ప్రధాన లక్ష్యం ఉత్తర కొరియాను అడ్డుకోవడమే అని అన్నారు. ఉత్తర కొరియా రక్షణ మంత్రి నో క్వాంగ్ చోల్ మాట్లాడుతూ.. అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ జార్జ్ వాషింగ్టన్ బుసాన్‌లో ప్రవేశించడం, ఇటీవల జరిగిన అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త వైమానిక విన్యాసాలు పరిస్థితిని మరింత రెచ్చగొట్టాయని అన్నారు. శత్రువుల బెదిరింపుల నుంచి తమ భద్రతను నిర్ధారించుకోవడానికి, శాంతిని పరిరక్షించే సూత్రంపై తాము మరింత దూకుడు చర్యలు తీసుకుంటామని నో హెచ్చరించారు.