Donald Trump: భారతీయులకు అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వొద్దు.. ట్రంప్ సంచలన ప్రకటన!
AI సమ్మిట్‌లో ట్రంప్ సంతకం చేసిన 3 కార్యనిర్వాహక ఆదేశాలలో ఒక జాతీయ ప్రణాళిక ఉంది. ఇది అమెరికన్ AI పరిశ్రమను బలోపేతం చేయడానికి, పూర్తిగా అమెరికన్ AI టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంపై కేంద్రీకరిస్తుంది.
- By Gopichand Published Date - 03:15 PM, Thu - 24 July 25

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్, చైనాలపై తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అమెరికన్ టెక్ కంపెనీలకు కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తూ చైనాలో ఫ్యాక్టరీలు స్థాపించడం, భారతదేశం ఉద్యోగులను నియమించుకోవడం వంటి ‘పాత వ్యూహాలను’ ఇకపై విడిచిపెట్టాలని సూచించారు. బుధవారం జరిగిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన AIకి సంబంధించిన మూడు ముఖ్యమైన కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. ఈ ఆదేశాలలో అమెరికన్ AI పరిశ్రమను ప్రోత్సహించడానికి పూర్తిగా అమెరికన్ AI టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఒక వైట్ హౌస్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది.
అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం: ట్రంప్
ట్రంప్ మాట్లాడుతూ.. చాలా కాలంగా అనేక పెద్ద అమెరికన్ టెక్ కంపెనీలు (గూగుల్, ఆపిల్) ‘రాడికల్ గ్లోబలిజం’ మార్గంలో నడిచాయని, ఇది లక్షలాది మంది అమెరికన్లను మోసం చేసి, వారిని నిరుపయోగంగా భావించేలా చేసిందని విమర్శించారు. ఆయన తన ప్రసంగంలో మాట్లాడుతూ.. మా అతిపెద్ద టెక్ కంపెనీలు అమెరికన్ స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. కానీ వారి ఫ్యాక్టరీలను చైనాలో స్థాపించాయి. భారతదేశం ఉద్యోగులను నియమించాయి. ఐర్లాండ్‌లో లాభాలను దాచాయి. అంతేకాక ఈ కంపెనీలు తమ స్వంత దేశ ప్రజలను నిర్లక్ష్యం చేశాయి. వారి గొంతును అణచివేశాయి. నా నాయకత్వంలో ఇప్పుడు ఆ రోజులు ముగిశాయి. ఇప్పుడు టెక్ కంపెనీలు అమెరికాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.
Also Read: IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్.. రెండో రోజు ఆటకు వర్షం ముప్పు?!
ట్రంప్.. సిలికాన్ వ్యాలీ, దాని వెలుపల ఉన్న టెక్ కంపెనీలను ‘దేశభక్తి- జాతీయ నిష్ఠ’ భావనను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ట్రంప్ మాట్లాడుతూ.. మాకు కావాల్సింది అమెరికన్ టెక్ కంపెనీలు పూర్తిగా అమెరికాకు అంకితం కావాలి. అంతే మేము కోరుకుంటున్నాం అని అన్నారు. AI సమ్మిట్‌లో ట్రంప్ సంతకం చేసిన 3 కార్యనిర్వాహక ఆదేశాలలో ఒక జాతీయ ప్రణాళిక ఉంది. ఇది అమెరికన్ AI పరిశ్రమను బలోపేతం చేయడానికి, పూర్తిగా అమెరికన్ AI టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంపై కేంద్రీకరిస్తుంది. అమెరికాను AI రేసులో ముందంజలో ఉంచాలనే ట్రంప్ ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగం.