Nightclub fire: రష్యాలోని క్లబ్ లో మంటలు.. 13 మంది మృతి..!
రష్యాలోని కోస్ట్రోమా నగరంలో నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో
- By Gopichand Published Date - 09:10 AM, Sun - 6 November 22

రష్యాలోని కోస్ట్రోమా నగరంలో నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఒక వ్యక్తి బాణసంచా కాల్చడం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా వెబ్‌సైట్ ప్రకారం.. నిందితుడిని పోలీసులు ఇప్పటికే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మంటలు అంటుకున్న క్షణాల్లోనే క్లబ్ లోపలి భాగమంతా పొగతో నిండిపోయిందని, అక్కడున్న వారికి బయటకు వెళ్లేందుకు దారి కూడా కనిపించలేదని, పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిపోయిందని ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని 250 మందిని కాపాడారు. మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 3,500చ.మీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 5 గంటలు సమయం పట్టిందని రెస్క్యూ బృందాలు తెలిపాయి. గతంలో 2009లో ప్రేమ్ నగరంలోని హార్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 156 మంది ప్రాణాలు కోల్పోయారు.