HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Nepal Government Backs Down Lifts Ban On Social Media

Nepal: వెనక్కి తగ్గిన నేపాల్‌ ప్రభుత్వం .. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజల్లో అసంతృప్తిని గమనించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్లు సాధారణంగా పనిచేస్తాయి అని తెలిపారు.

  • Author : Latha Suma Date : 09-09-2025 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nepal government backs down, lifts ban on social media
Nepal government backs down, lifts ban on social media

Nepal : నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం తీవ్ర నిరసనలు, హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తరువాత అధికారికంగా ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న కీలక నిర్ణయంగా భావించబడుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజల్లో అసంతృప్తిని గమనించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్లు సాధారణంగా పనిచేస్తాయి అని తెలిపారు.

Read Also: Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్‌.. ఓటేసిన ప్రధాని మోడీ

గత గురువారం, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (మునుపటి ట్విట్టర్), లింక్డిన్, రెడిట్‌ వంటి 26 ప్రముఖ సామాజిక మాధ్యమాలు నేపాల్ కమ్యూనికేషన్ శాఖలో రిజిస్టర్ కావడంలో విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వంగా నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరిగింది. ఖాట్మండు, పోఖరా, బిర్‌గంజ్ వంటి ముఖ్య పట్టణాల్లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు ముట్టడికి యత్నించగా, పోలీసులు వాటిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, జలఫిరంగులు, రబ్బరు బుల్లెట్లు వాడారు. ఈ ఘటనల్లో దురదృష్టవశాత్తు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది యువతే ఉండడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే వ్యవహరించి, సంబంధిత శాఖలతో చర్చించి నిషేధాన్ని ఎత్తివేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు మళ్లీ యాక్సెస్‌కి వచ్చాయి. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ప్రజలు ఆందోళనలు విరమించాలని కోరుతున్నాం అని మంత్రి గురుంగ్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, నేపాల్‌లో ఉత్కంఠభరిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత్‌ అక్కడున్న తన పౌరులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. విదేశాంగశాఖ ప్రకటనలో నేపాల్‌లోని స్థానిక అధికారుల సూచనలు, ఆదేశాలను భారతీయులు తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలి అని సూచించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎంతవరకు సమంజసం అన్నదానిపై నిపుణులు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజల నిత్య జీవితాల్లో భాగంగా మారిన ఈ మాధ్యమాలపైగా ఆంక్షలు విధించడం వల్ల సమాచారం హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలపై ప్రభావం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నేపాల్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ఫలితంగా జరిగిన ప్రాణనష్టం, సామాజిక స్థితిగతుల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఉదాహరణగా ఇది నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Facebook
  • instagram
  • Nepal Govt
  • Nepal Prime Minister KP Sharma Oli
  • Social Media Ban
  • whatsapp
  • X
  • youtube

Related News

Youtube

ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd