HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Modi Extends Wishes To Nepals New Prime Minister

Nepal Prime Minister: నేపాల్ నూతన ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi congratulates PM Shah
PM Modi congratulates PM Shah

Balen Shah  నేపాల్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ర్యాప్ గాయకుడు బాలెన్ షాకు (బాలేంద్ర షాకు) భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. “నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనం. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.

శుక్రవారం నేపాల్ నూతన ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) పార్లమెంటరీ పార్టీ నేత బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలెన్‌ షాను ఆ పదవిలో నియమిస్తూ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన సమావేశంలో బాలెన్ షాను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆర్‌ఎస్‌పీ ఎన్నుకుంది. దీంతో ఆయన దేశ 47వ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. కేవలం 35 ఏళ్ల వయసున్న బాలెన్, నేపాల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కులైన ప్రధానులలో ఒకరిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అధిక శాతం చట్టసభ సభ్యులు యువతరం వారే కావడం నేపాల్ రాజకీయాల్లో తరాల మార్పునకు సంకేతంగా నిలుస్తోంది.

గత ఏడాది డిసెంబర్ 28న జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలెన్, యువతలో విపరీతమైన ఆదరణ పొందారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో, ఆర్‌ఎస్‌పీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేయగా, 275 స్థానాలున్న ప్రతినిధుల సభలో 182 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. తూర్పు నేపాల్‌లోని ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై బాలెన్ షా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓలీకి 18,734 ఓట్లు రాగా, షాకు 68,348 ఓట్లు లభించాయి. 1991 తర్వాత నేపాల్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఒక అభ్యర్థికి లభించిన అత్యధిక ఓట్లు ఇవే కావడం విశేషం.

బాలెన్ షా 2022లో ఖాట్మండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1990 ఏప్రిల్ 27న ఖాట్మండులో జన్మించిన ఆయన, భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. తన హుషారైన ర్యాప్ గీతాలతో యువతలో పాపులారిటీ సంపాదించుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balen Shah
  • India Nepal relations
  • Indian PM Narendra Modi
  • Nepal politics
  • Nepal Prime Minister
  • Rastriya Swatantra Party

Related News

Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్‌కు కూడా డైరెక్టరేట్‌ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్‌

  • An interesting development during Modi's visit to France: Emmanuel Macron posts a song by Durandhar.

    Emmanuel Macron: మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఆసక్తికర పరిణామం.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

  • Bharathiraja passes away... an irreparable loss to the film industry: PM Modi

    Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd