HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Massive Floods In China Kill 34 People

Heavy Rains : చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి

బీజింగ్‌లోని మియున్‌ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్‌లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్‌లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

  • Author : Latha Suma Date : 29-07-2025 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Massive floods in China kill 34 people
Massive floods in China kill 34 people

Heavy Rains : చైనా రాజధాని బీజింగ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వరదలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, బీజింగ్‌లో జరిగిన వరదల కారణంగా ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దాదాపు 80 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. బీజింగ్‌లోని మియున్‌ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్‌లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్‌లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని బీజింగ్‌ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

ఇప్పటివరకు దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీరిలో 17 వేలకు పైగా మియున్‌ జిల్లాకు చెందినవారు. లువాన్‌పింగ్‌ కౌంటీకి చెందిన పలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీరు ఆప్రాంతాలను ముంచివేయడంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. వారికి సహాయాన్ని అందించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నదుల్లో వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువన ఉన్న గ్రామాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత తొందరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్నిచోట్ల వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రహదారులపై అడ్డంకులు ఏర్పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలిన ఘటనలతో పలు ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి. ప్రావిన్స్‌లోని లువాన్‌పింగ్‌ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ఈ విపత్తుపై స్పందించిన చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ భారీ వర్షాలు, వరదలు దేశానికి తీవ్ర నష్టం కలిగించాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం మాత్రమే కాదు, ఆస్తి నష్టాలు కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, అవసరమైన అన్ని నిబంధనలతో సహాయక బృందాలు రంగంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసి, అక్కడకు తరలించిన ప్రజలకు తిండి, నీరు, ప్రాథమిక వైద్యం వంటి అవసరాలను అందిస్తున్నారు. విద్యుత్, రవాణా వంటి విభాగాల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వరదల ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తతే మేలు అనే సందేశాన్ని స్థానిక అధికారులు ప్రజలకు నిస్తూ ఉంటున్నారు. అధికార యంత్రాంగం స్పందన వేగంగా ఉండటం ఊరట కలిగిస్తోంది గానీ, మరిన్ని ప్రాణనష్టం జరగకూడదనే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read Also: Nimisha Priya : యెమెన్‌లో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు.. భారత ప్రభుత్వ కృషికి ఫలితం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 34 people died
  • Beijing
  • china
  • heavy rains
  • Landslides
  • Miyun District

Related News

Trump

ట్రంప్ విధానాలపై చైనా ఘాటు విమర్శలు!

ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా తనను తాను ఒక బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, శాంతి మధ్యవర్తిగా నిలబెట్టుకోవాలని చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • China Husband Divorces Sick Wife For Losing Hair

    బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

  • India tops global list of young entrepreneurs

    యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం

Latest News

  • తెలంగాణ వ్యాప్తంగా మొదలైన మున్సిపల్ నామినేషన్ల జోరు

  • ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చివ‌రి పోస్ట్ ఇదే!

  • అజిత్ ప‌వార్ విమానంలో లేడీ పైల‌ట్.. ఎవరీ శాంభవి పాఠక్?

  • అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు వైరల్

  • అజిత్ పవార్ మృతి పై మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్

Trending News

    • వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్​ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే

    • అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

    • జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు

    • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd