Canada New PM: కెనడా ప్రధానిగా ఆర్థికవేత్త కార్నీ.. ఆయన హిస్టరీ గొప్పదే
మార్క్ కార్నీ 1965లో కెనడాలోని(Canada New PM) ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు.
- By Pasha Published Date - 07:19 AM, Mon - 10 March 25

Canada New PM: కెనడా ప్రధానమంత్రి పదవికి జరిగిన ఎన్నికలో అనూహ్య ఫలితం వచ్చింది. ఇందుకోసం అధికార లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్‌లో అత్యధిక ఓట్లను 59 ఏళ్ల మార్క్ కార్నీ (Mark Carney) సాధించారు. దీంతో దేశ ప్రధాని పదవి ఆయనకే దక్కనుంది. కెనడా 24వ ప్రధానిగా కార్నీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇంతటితో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో పాలనకు తెరపడింది. ప్రత్యేకించి భారత్ విషయంలో ఆయన అత్యంత కఠినంగా, కక్షపూరితంగా వ్యవహరించి చేతులారా వ్యక్తిగత ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు.
Also Read :MLC Candidates: సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు.. నేపథ్యమిదీ
ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?
కెనడాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ పార్టీకి మొత్తం 1.50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. మార్క్ కార్నీకి 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9 శాతానికి సమానం. రెండో స్థానంలో నిలిచిన క్రిస్టియా ఫ్రీలాండ్‌కు 11,134 ఓట్లు, కరినా గౌల్డ్‌కు 4,785 ఓట్లు, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి.
Also Read :TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
ఎవరీ మార్క్ కార్నీ ?
- మార్క్ కార్నీ 1965లో కెనడాలోని(Canada New PM) ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు.
- ఆయన హార్వర్డ్‌లో ఉన్నత విద్యను చదివారు.
- విఖ్యాత బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేశారు.
- 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికయ్యారు.
- 2004లో కెనడా ఆర్థిక మంత్రి అయ్యారు.
- 2008 ఫిబ్రవరి 1న కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయ్యారు.
- 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా కార్నీ ఎంపికయ్యారు.ఆ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్ ఈయనే.
- జీ7 దేశాలకు చెందిన రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన రికార్డు కూడా కార్నీ సొంతం.
- 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి కార్నీ బయటికి వచ్చారు.
- తదుపరిగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా కార్నీ వ్యవహరించారు.
- కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత ఎన్నిక ప్రక్రియ మొదలైంది. అత్యధిక విరాళాలను సేకరించిన అభ్యర్థిగా కార్నీ నిలిచారు.