KP Sharma Oli : నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) నేపాల్ కాంగ్రెస్ తో జట్టు కట్టి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలిని ప్రధాని పదవి వరించింది.
- By Latha Suma Published Date - 06:50 PM, Sun - 14 July 24

KP Sharma Oli: నేపాల్(Nepal) కొత్త ప్రధాని(New Prime Minister)గా కేపీ శర్మ ఓలి గద్దెనెక్కనున్నారు. ఈ మేరకు కేపీ శర్మ ఓలి రేపు నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా… ఒప్పందం ప్రకారం అధికార బదలాయింపునకు మాజీ ప్రధాని ప్రచండ అంగీకరించకపోవడం, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి దిగిపోక తప్పలేదు. దాంతో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) నేపాల్ కాంగ్రెస్ తో జట్టు కట్టి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలిని ప్రధాని పదవి వరించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ (Nepal PM Pushpa Kamal Dahal)కు శుక్రవారం (జూలై 12) పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు. ఈక్రమంలోనే కే.పీ. శర్మ ఓలి(72) నేతత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా సారథ్యంలోని నేపాలి కాంగ్రెస్(ఎన్‌సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల(సీపీఎన్-యూఎంఎల్-77, ఎన్‌సీ-88) సంతకాలను ఓలి సమర్పించారు. ప్రచండ ప్రధాని పదవి నుండి వైదొలిగాడంతో నూతన ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు కొత్త మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. కొన్ని రోజుల క్రితమే ఓలి, దేవ్‌బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు ఆయన ఇదివరకు రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు.
నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ పార్లమెంట్ దిగువసభలో విశ్వాసపరీక్షలో నెగ్గలేకపోయారు. ఆయనకు మద్దతుగా కేవలం 63 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 193 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓ ఎంపీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్లమెంటుకు మొత్తం 258 మంది ఎంపీలు హాజరయ్యారు.
Read Also: Delhi: ఢిల్లీ ఆస్పత్రిలో కాల్పులు, రోగి మృతి