Hamas Tunnels : హమాస్ సొరంగాల్లో సముద్రపు నీటి సునామీ !
Hamas Tunnels : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ మొదటి లక్ష్యం.. హమాస్ మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడం.
- By Pasha Published Date - 12:01 PM, Tue - 5 December 23

Hamas Tunnels : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ మొదటి లక్ష్యం.. హమాస్ మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడం. రెండో లక్ష్యం.. హమాస్ మిలిటెంట్ల అండర్ గ్రౌండ్ రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే హమాస్ మిలిటెంట్ల ఏరివేతలో సఫలమైన ఇజ్రాయెల్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ టన్నెల్స్‌ను ధ్వంసం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో వందలాది హమాస్ రహస్య టన్నెల్స్‌ను బాంబులతో పేల్చేసింది. టన్నెల్స్ నెట్ వర్క్‌ను విధ్వంసం చేసేందుకుగానూ మరో కొత్త ప్లాన్ కూడా ఇజ్రాయెలీ ఆర్మీ రెడీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అదేమిటంటే.. గాజాలోని సొరంగాల్లోకి పెద్ద మొత్తంలో సముద్రపు నీటిని పంపించడం. గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న ఇజ్రాయెలీ ఆర్మీ.. పక్కనే ఉన్న మధ్యధరా సముద్రం నుంచి గాజాలోని తీర ప్రాంతాల్లోకి భారీ పైపులైన్లు వేసింది. గాజాలోని అల్-షాతి హాస్పిటల్ సమీపంలో 5 పెద్ద సముద్ర నీటి పంపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆ ఏరియాలో బయటపడే హమాస్ టన్నెల్స్‌లోకి గంటకు వేల క్యూబిక్ మీటర్ల స్పీడ్‌తో సముద్రపు నీటిని పంపించి నింపేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంకా ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టలేదు.
Also Read:Tummala Nageshwara Rao : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా తుమ్మల ?
హమాస్ టన్నెల్స్‌ను సముద్రపు నీటితో నింపేయడం ఈజీ విషయమే. కానీ ఆ తర్వాత గాజాలో ఏం జరుగుతుంది ? అనేది చాలా ముఖ్యం. సముద్రపు ఉప్పు నీరు హమాస్ టన్నెల్స్‌లోకి ప్రవేశిస్తే.. గాజాలోని భవనాల పునాదులు వీక్ అయిపోతాయి. దీంతో అవి కూలిపోయే ముప్పును ఎదుర్కొంటాయి. గాజా నేలలోని ఖనిజ విలువల సారం అనేది తగ్గిపోతుంది. ఫలితంగా అవి పంటల సాగుకు పనికి రాకుండా పోతాయి. గాజా పరిధిలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే రిస్క్ ఏర్పడుతుంది. ఇక్కడి భూగర్భజలాల నాణ్యత కూడా తగ్గిపోతుంది. అందుకే సాక్షాత్తూ అమెరికా కూడా ఇలాంటి చేష్టలు చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలుకుతోంది. ఐక్యరాజ్యసమితి కూడా దీనిపై ఇజ్రాయెల్‌ను వారిస్తోంది. ఇక బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తారు ? అనేది(Hamas Tunnels) వేచిచూడాలి.