Third World War : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
Third World War : ఈ యుద్ధానికి అనూహ్యమైన ఆర్థిక ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఆయిల్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే, అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషణ
- Author : Sudheer
Date : 14-06-2025 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న మిస్సైల్ దాడులు (Iran – Israel War ) ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. తుపానుల్లా మిస్సైళ్లు ఆకాశంలో పేలిపోతుండటంతో ప్రాంతీయ శాంతి భద్రతలు అతలాకుతలమవుతున్నాయి. ఈ దాడులపై గమనిస్తున్న అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి (Third World War) నాంది కావొచ్చని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న స్థితిని ఆపడం చాలా కష్టమైన దశకు చేరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాలూ ఎదో ఒకదానిపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి. ఇదే తీరులో పోతే మరిన్ని దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందని, దాంతో ప్రపంచ యుద్ధం ముప్పు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. యుద్ధం కేవలం ఆయుధాలతో మాత్రమే కాక, డిజిటల్ వేదికలపై, ఆర్థికంగా కూడా సాగుతోంది.
Tamil Nadu Assembly : బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలు
ఈ యుద్ధానికి అనూహ్యమైన ఆర్థిక ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఆయిల్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే, అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషణ. దీనివల్ల దిగుమతి మీద ఆధారపడే దేశాలకు ఇది మిగులు భారం అవుతుంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు, పెట్టుబడులపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వేగంగా మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై స్పందించాల్సిన అవసరం స్పష్టమవుతోంది.