HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Issued A Strong Warning To Donald Trump

IRAN: డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్…

  • Author : Vamsi Chowdary Korata Date : 13-04-2026 - 3:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ceasefire
Ceasefire

US Navy Announces Naval Blockade On Iran అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధనం విధించడంతో, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ సైతం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ పోర్టుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈరోజు (ఏప్రిల్ 13) నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యను ఇరాన్ “సముద్రపు దొంగతనం”గా అభివర్ణించింది. అమెరికాకు, సముద్రపు దొంగలకు పెద్దగా తేడా లేదని విమర్శించింది. “గల్ఫ్‌లోని పోర్టుల భద్రత అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండదు. మా పోర్టులను లక్ష్యంగా చేసుకుంటే, ఈ ప్రాంతంలోని అన్ని పోర్టులూ ప్రమాదంలో పడతాయి” అని ఇరాన్ ఖతామ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ తీవ్రంగా హెచ్చరించింది.

ఇటీవల పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దిగ్బంధనానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని CENTCOM స్పష్టం చేసింది. మరోవైపు, హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని, తమ సైనిక నౌకల వద్దకు వస్తే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది.

ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధిలో ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోయి, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఈసారి మరింత భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CENTCOM
  • Donald Trump
  • Iran IRGC
  • Iran US tensions
  • Iran War
  • IRGC
  • Middle East crisis
  • Persian Gulf
  • Strait of Hormuz
  • US Oil Exports

Related News

NATO chief defends US attacks on Iran.

US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

వాషింగ్టన్ 80 లక్ష్యాలపై దాడి చేయడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీనికి ప్రతిగా బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇరాన్ వ్యాప్తంగా 80కి పైగా లక్ష్యాలపై వాషింగ్టన్ తాజాగా సైనిక దాడులు ప్రారంభించడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ ఒక ప్రమాదకరమైన కొత్త దశలోకి ప్రవేశించింది. దీనికి ప్రతిగా బహ్రెయి

  • The Strait of Hormuz is once again in turmoil. How will this impact the Iran-US peace agreement?

    Hormuz crisis: హోర్ముజ్ జలసంధి మరోసారి అట్టుడికిపోతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • Iran's missile attacks on oil tankers in Hormuz

    Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

  • Central Government Lifts Em

    Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Cm Revanth Reddy: తన సవాలులో తాను చిక్కుకున్నా KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

  • Shiv Sena: థానే ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ దాడి

  • Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

  • kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd