HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Drone Attack On Saudi Arabias Largest Refinery

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

  • Author : Vamsi Chowdary Korata Date : 02-03-2026 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iranian Drone Strike Forces Saudi Aramco
Iranian Drone Strike Forces Saudi Aramco

Saudi Aramco  పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ ఉదయం సౌదీ అరాంకోకు చెందిన అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం ‘రాస్ తనూరా’పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దాడి కారణంగా సౌదీ అరాంకో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. సౌదీ రక్షణ శాఖ ఈ డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించినప్పటికీ, ప్లాంట్ వద్ద అగ్నిప్రమాదం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కేవలం సౌదీ అరేబియానే కాకుండా యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది.

ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన ‘హోర్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 13 శాతం పెరిగి బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరుకుంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధర 100 డాలర్లను దాటవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇరాన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఇరాన్ పై దాడులకు అనుమతించేది లేదని తాము అమెరికా, ఇజ్రాయెల్ లకు స్పష్టం చేసినప్పటికీ… తమపై ఇరాన్ దాడులకు దిగిందని సౌదీ అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crude Oil Price
  • global oil supply
  • Hormuz Strait
  • Iran
  • Middle East conflict
  • Oil Prices
  • petroleum prices
  • Ras Tanura refinery
  • Saudi Aramco
  • Saudi Aramco attack

Related News

Saudi Arabia slashes crude oil prices.

Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసా

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd