HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Indonesia Hit By Earthquake

Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం..!

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.

  • By Gopichand Published Date - 04:47 PM, Wed - 16 November 22
  • daily-hunt
Philippines
Earthquake 1 1120576 1655962963

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రాకు నైరుతి దిశలో బుధవారం ఈ భూకంపం వచ్చినట్లు తేలింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం నుంచి 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. ఆ దేశం బాలిలో G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి చివరి రోజు ఆతిథ్యం ఇచ్చింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు అందలేదు.

మరోవైపు.. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు బుధవారం ముగిసింది. ఈ రెండు రోజుల్లో అభివృద్ధి, శాంతి ఎజెండాపై చర్చించడానికి ప్రపంచ నాయకులు బాలిలో సమావేశమయ్యారు. దీంతో ఇండోనేషియా వచ్చే ఏడాది పాటు జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు అప్పగించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో అధికారికంగా జి-20 అధ్యక్ష పదవిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం భారత దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోదీ చైర్మన్‌గా స్వీకరిస్తూ అన్నారు. జి-20లోని ప్రతి సభ్యదేశాల కృషితో ప్రపంచ సంక్షేమానికి మేం దీన్ని ప్రయోజనకరంగా మారుస్తామని మోదీ చెప్పారు.

ఇండోనేషియాలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు ముగియడంతో దాని సభ్య దేశాలు కూడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ ‘జి-20 ఫలితాల పత్రం’ రూపకల్పనలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందని అన్నారు. భారత్‌కు జి-20 చైర్మన్‌ పదవి దక్కడంపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ మాట్లాడుతూ భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించడం చాలా ప్రోత్సాహకరంగా ఉందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bali
  • earthquake
  • earthquake in indonesia
  • G20
  • Indonesia
  • sumatra
  • world news

Related News

North Korea- South Korea

North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

అమెరికన్ రక్షణ మంత్రి పీట్ హేగ్‌సెత్ ఇంతకుముందు మాట్లాడుతూ.. అమెరికా-దక్షిణ కొరియా కూటమి (Alliance) ప్రధాన లక్ష్యం ఉత్తర కొరియాను అడ్డుకోవడమే అని అన్నారు.

  • Nuclear Testing

    Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Nepal

    Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

  • Strongest Currencies

    Strongest Currencies: ప్ర‌పంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!

Latest News

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

  • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd