HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Indias Big Shock To Pakistan Water From Ravi River Blocked

పాక్‌కు భార‌త్ భారీ షాక్..రావి నది నుంచి నీళ్లు బంద్

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 9:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravi River
Ravi River
Indus Waters Treaty  పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకుందని, మార్చి 31 నాటికి ఇది పూర్తవుతుందని జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రాణా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రావి నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే నీరు పూర్తిగా ఆగిపోనుంది.

ఈ బ్యారేజీ ద్వారా నిల్వ చేసిన నీటిని జమ్మూ కశ్మీర్‌లోని కరవు పీడిత ప్రాంతాలైన కతువా, సాంబా జిల్లాల్లోని 32,173 హెక్టార్ల వ్యవసాయ భూములకు సాగునీరు అందించనున్నారు. దీంతో పాటు పంజాబ్‌లోనూ 5,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఇప్పటివరకు భారత్ వినియోగించుకోని ఈ నీరు వృథాగా పాకిస్థాన్‌కు వెళ్తోందని, ఇకపై దానిని మన రైతుల ప్రయోజనాల కోసం వాడుకుంటామని మంత్రి రాణా స్పష్టం చేశారు.

1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 1982లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసినా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా దశాబ్దాలుగా నిలిచిపోయింది. 2018లో కేంద్రం జోక్యంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంలో భాగంగానే భారత్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Pakistan Dispute
  • Indira Gandhi
  • Indus Waters Treaty
  • irrigation project
  • jammu kashmir
  • Modi Govt. Indus Waters Treaty
  • Ravi River
  • Shahpurkandi Barrage
  • Sindhu Water Dispute
  • water dispute
  • Water Disputes
  • Water Resources

Related News

Iran Israel War Schools Shut In Kashmir

హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

Jammu Kashmir  సుదూర తీరాన ఉన్న ఇరాన్‌లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్‌ను పోలీ

    Latest News

    • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

    • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

    • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

    • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

    • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd