Trump Effect : పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న భారతీయ విద్యార్థులు
Trump Effect : చాలామంది విద్యార్థులు గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో పార్ట్ టైమ్ చేస్తూ వస్తున్నారు
- Author : Sudheer
Date : 25-01-2025 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా( America)లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు (Part time jobs) చేస్తున్న భారతీయ విద్యార్థులు (Indian students ) భయం భయంగా గడుపుతున్నారు. స్టూడెంట్ వీసా (F-1) కలిగి ఉన్న వీరు యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది విద్యార్థులు గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో పార్ట్ టైమ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ (Trump ) వీరిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
Vladimir Putin : ఉక్రెయిన్ సమస్యపై రష్యా చర్చలకు సిద్ధం
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వలసల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థులు యూనివర్సిటీ నియమాలు ఉల్లంఘించి, క్యాంపస్ వెలుపల అనుమతి లేకుండా ఉద్యోగాలు చేస్తుండటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇలా బయట ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తనిఖీలు చేపట్టడం మొదలుపెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యార్థులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం తో ఈ తనిఖీల్లో పట్టుబడితే, వారి స్టూడెంట్ వీసాలను రద్దు చేస్తామని, తక్షణమే స్వదేశాలకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో తీవ్ర భయం నెలకొంది.
పార్ట్ టైమ్ ఉద్యోగాలు మానేయాలని, నిబంధనలు అతిక్రమించకుండా ఉండాలని యూనివర్సిటీలు తమ విద్యార్థులకు సూచిస్తున్నాయి. మొత్తానికి, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు విదేశీ విద్యార్థుల జీవితాలను గడ్డు పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి.