HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >India Us Trade Tensions Tariff Dispute

Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

  • Author : Kavya Krishna Date : 06-09-2025 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trade War
Trade War

Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్‌) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న వేళ, అమెరికా అధికారులు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితులను సంక్లిష్టతరం చేస్తున్నారు. ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో విమర్శలు ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు వాణిజ్య కార్యదర్శి హోవార్డ్‌ లుట్నిక్ కూడా భారత్‌పై పరుష వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోవార్డ్‌ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్ రెండు నెలల్లో తప్పనిసరిగా అమెరికాకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని, చర్చలకు దిగక తప్పదని వ్యాఖ్యానించారు. “ఇప్పుడే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. చివరికి భారత్‌ యూఎస్‌ మార్కెట్‌నే ఆశ్రయించాల్సి వస్తుంది. కస్టమర్ ఎల్లప్పుడూ సరిగా ఉంటాడు. అందుకే అమెరికాతో మళ్లీ ఒప్పందాలకు సన్నద్ధం కావాల్సిందే” అని లుట్నిక్ అన్నారు.

ఉక్రెయిన్–రష్యా యుద్ధం తర్వాత భారత్‌ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోందని లుట్నిక్ ఆరోపించారు. “యుద్ధానికి ముందు భారత్‌ కేవలం 2 శాతం మాత్రమే రష్యా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడు అది 40 శాతానికి చేరింది. దీంతో రష్యాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందుకే రష్యా శాంతి చర్చలకు ముందుకు రావడం లేదు. భారత్‌ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

చైనా, యూరోపియన్‌ దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా, భారత్‌పైనే అమెరికా కఠినంగా టారిఫ్‌లు విధించడంపై ప్రశ్నించగా, లుట్నిక్‌ స్పష్టతనిచ్చారు. “చైనీయులు, భారతీయులు మనకు అమ్ముతారు. కానీ వారు ఒకరికొకరు మాత్రం అమ్ముకోరు. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్‌ వారికి తప్పనిసరి అవుతుంది. అందుకే భారత్‌ మళ్లీ మాకు దగ్గర కావాల్సిందే” అని లుట్నిక్ అన్నారు.

లుట్నిక్‌ తన హెచ్చరికలో భాగంగా.. భారత్‌ అమెరికాతో చర్చలకు దిగకపోతే, 50 శాతం సుంకం భరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత కఠిన స్థితికి నెడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగుతాయన్న స్పష్టమైన సంకేతాలు భారత్‌ ఇచ్చింది. “మన దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాం” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అమెరికా ఒత్తిడి ఉన్నా.. జాతీయ ప్రయోజనాలు ప్రాధాన్యమేనని భారత్‌ సంకేతమిచ్చింది. సుంకాల వివాదం వాణిజ్య సంబంధాలను గందరగోళంలోకి నెడుతుండగా, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఉద్రిక్తతలు ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, భారత్‌ చమురు దిగుమతులపై అమెరికా చూపిస్తున్న కఠిన వైఖరి, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలకు సవాలు కానుంది.

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Howard Lutnick
  • india
  • nirmala sitharaman
  • Russia Oil
  • Tariffs
  • Trade war
  • USA

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Tragic accident in the US: Young woman from NTR district dies.

    Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Celebrations of America's 250th Independence Day

    Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd