HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >In Inflation Hit Pakistan Egg Prices Soar To Rs 400 Per Dozen

Pakistan Egg Prices: పాకిస్తాన్ లో ఆకాశాన్నంటుతున్న ధరలు.. కిలో చికెన్ రూ. 615, 12 గుడ్ల ధర రూ. 400..!

పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. CNBC నివేదిక ప్రకారం.. లాహోర్‌లో 12 గుడ్ల ధర 400 పాకిస్తాన్ రూపాయల (Pakistan Egg Prices)కు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ప్రజల కష్టాలను పెంచాయి.

  • By Gopichand Published Date - 11:30 AM, Tue - 16 January 24
  • daily-hunt
Pakistan Egg Prices
How to Storage Eggs for so Many Days in Home Tips

Pakistan Egg Prices: పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితి కారణంగా పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి పదే పదే రుణాలు తీసుకోవలసి వస్తుంది. దీనితో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులకు ఆహార పదార్థాలు కొనడం కూడా కష్టంగా మారింది. CNBC నివేదిక ప్రకారం.. లాహోర్‌లో 12 గుడ్ల ధర 400 పాకిస్తాన్ రూపాయల (Pakistan Egg Prices)కు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ప్రజల కష్టాలను పెంచాయి.

ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు

కోడిగుడ్లే కాదు నిత్యం ఆహారంలో ఉపయోగించే ఉల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కిలో ఉల్లిని రూ.230 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఉల్లి గరిష్ఠ ధర రూ.175గా నిర్ణయించినా మార్కెట్‌లో నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారు. పాకిస్తాన్ వార్తల ప్రకారం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ప్రభుత్వం అనేక అవసరమైన ఆహార పదార్థాల ధరలను నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయడంలో స్థానిక పరిపాలన విఫలమైంది.

Also Read: Stomach Cancer: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఇవే..!

చికెన్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి

ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరల కారణంగా పాకిస్థాన్‌లో సామాన్యుల ప్లేట్ల నుంచి చికెన్ దాదాపు కనుమరుగైంది. మీడియా కథనాల ప్రకారం.. లాహోర్‌లో ఒక కిలో చికెన్ 615 రూపాయలకు లభిస్తుంది. దీంతో పాటు పాల ధర కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. పాకిస్థాన్‌లో లీటరు పాలు రూ.213కి లభిస్తున్నాయి. టమోటా కిలో రూ.200, బియ్యం కిలో రూ.328కి విక్రయిస్తున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ డేటాబేస్ ప్రకారం.. పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం రేటు 2023లో 30 శాతానికి చేరుకుంది. ఈ కాలంలో దేశ జిడిపి -0.5 శాతంగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

విదేశీ మారకద్రవ్య నిల్వలు నిరంతరం పడిపోతున్నాయి

పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు నిరంతరం క్షీణిస్తూనే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా ప్రకారం.. నవంబర్ 2023లో దేశంలో విదేశీ మారక నిల్వలు 7 బిలియన్లుగా ఉన్నాయి. జూలై 2023లో ఇది 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిస్థితిలో గత నాలుగు నెలల్లో విపరీతమైన క్షీణత కనిపించింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని IMF 3 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీని ఇవ్వడానికి ప్రకటించింది. అందులో రెండు వాయిదాలు కూడా ఆమోదించబడ్డాయి. పాకిస్తాన్ జూలై 2023లో IMF నుండి $1.2 బిలియన్ల మొదటి విడతను అందుకుంది. రెండవ విడత త్వరలో అందుతుందని భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Egg Prices
  • pakistan
  • Pakistan Economy Crisis
  • Pakistan Egg Prices
  • Pakistan Inflation
  • world news

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd