Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ
వాస్తవానికి ఈ టెక్నాలజీని 'ఎయిర్ డాన్షిన్ సిస్టమ్స్'(Floating Houses) కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు 2012లోనే తయారు చేశారు.
- By Pasha Published Date - 01:13 PM, Wed - 14 May 25

Floating Houses : భూకంపాలు దడ పుట్టిస్తున్నాయి. భూకంపం రాగానే జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు ? అంటే.. భూకంపం ప్రభావంతో ఇళ్లు కూలే ముప్పు ఉంటుందనే భయం జనం మనసుల్లో గూడు కట్టుకుంది. ఈ భయాన్ని దూరం చేసే దిశగా జపాన్ శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఫ్లోటింగ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం..
Also Read :BSF Jawan Returned : బీఎస్‌ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్.. ఇలా దారికొచ్చింది!
కొత్త టెక్ అప్‌డేట్ ఏమిటంటే..
ప్రపంచంలో నిత్యం భూకంపాలతో పోరాడే దేశం ఏదైనా ఉందంటే.. అది జపాన్. అందుకే భూకంపాల విరుగుడుకు సంబంధించిన ఎన్నో సాంకేతికతలు ఆ దేశంలో తయారవుతున్నాయి. భూకంపాలను ఆపలేం అని జపాన్ సైంటిస్టులకు బాగా తెలుసు. అందుకే భూకంపం వచ్చినా తట్టుకొని నిలబడగలిగే బలమైన ఇళ్ల నిర్మాణంపై వాళ్లు ఫోకస్ పెట్టారు. గత కొన్ని దశాబ్దాల్లో భూకంపాలను తట్టుకునేలా జపాన్‌లో బలమైన ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు కొత్త టెక్ అప్‌డేట్ ఏమిటంటే.. భూకంపం వచ్చినప్పుడు ఇల్లు భూమి నుంచి కొంతమేర పైకి లేస్తుంది. దీనివల్ల ఇంటిపై భూప్రకంపనల ప్రభావం చాలావరకు పడదు. ఈ టెక్నాలజీని ‘ఎయిర్ డాన్షిన్ సిస్టమ్స్’ అనే జపనీస్ సంస్థ తయారు చేసింది.
Also Read :India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ
ఇంటి పునాది కింద ఎయిర్ ఛాంబర్.. ఎందుకు ?
- వాస్తవానికి ఈ టెక్నాలజీని ‘ఎయిర్ డాన్షిన్ సిస్టమ్స్'(Floating Houses) కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు 2012లోనే తయారు చేశారు. గత 13 ఏళ్లలో ఈ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దారు. అధునాతన సెన్సర్లు, ఎయిర్ కంప్రెషర్లను ఇళ్ల దిగువ భాగంలో జోడించారు.
- భూమి కంపించగానే.. సెన్సర్ల నుంచి నియంత్రణ వ్యవస్థకు సిగ్నల్స్ వెళ్తాయి. ఆ వెంటనే ఇంటి కింద ఉన్న శక్తివంతమైన ఎయిర్ కంప్రెషర్లు ఆన్ అవుతాయి.
- ఈ ఎయిర్ కంప్రెషర్లు భారీ మొత్తంలో గాలిని ఇంటి పునాది కింద ఉన్న ప్రత్యేక ఎయిర్ ఛాంబర్ లేదా బెలూన్‌లోకి పంపింగ్ చేస్తాయి.
- సదరు ఎయిర్ ఛాంబర్ లేదా బెలూన్‌లో గాలి నిండగానే.. పునాది నుంచి ఇల్లు కొన్ని సెంటీమీటర్లు మేర పైకి లేస్తుంది. ఆ సమయంలో చూడటానికి ఇల్లు గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది.
- ఇప్పటికే ఈ మోడల్‌లో జపాన్‌లో చాలామంది ఇళ్లను నిర్మించుకున్నారట.
- భారత్‌లోనూ భూకంప భయాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మన దేశంలోనూ ఈ తరహా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.