Hamas Mock Ups : ఇజ్రాయెల్ పై దాడికి సరిగ్గా నెల ముందు.. హమాస్ ఏం చేసిందంటే ?
Hamas Mock Ups : అక్టోబరు 7న (శనివారం రోజు) ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ వేలాది రాకెట్లతో విరుచుకుపడింది.
- By Pasha Published Date - 11:18 AM, Fri - 13 October 23

Hamas Mock Ups : అక్టోబరు 7న (శనివారం రోజు) ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ వేలాది రాకెట్లతో విరుచుకుపడింది. ఆ వెంటనే వందలాది మంది హమాస్ ఉగ్రవాదులు పారాచూట్లతో సరిహద్దు పై నుంచి ఇజ్రాయెల్ లోకి దూసుకొచ్చి.. ఇజ్రాయెలీలపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఓ వైపు యూదుల పండుగ ‘యోమ్ కిప్పూర్’ జరుగుతుండగా ఈ మారణహోమం చోటుచేసుకుంది. అయితే హమాస్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక కీలక విషయం ఇప్పుడు వెలుగుచూసింది. ఈ దాడి చేయడానికి ముందు.. హమాస్ మిలిటెంట్లు గాజాలోని ఒక ప్రదేశంలో ముమ్మర ప్రాక్టీస్ చేశారని తెలిసింది. ఈ ఏడాది సరిగ్గా నెల రోజుల ముందు.. సెప్టెంబరు 12న హమాస్ రెండు నిమిషాల నిడివిగల ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. నలుపు రంగు దుస్తులు ధరించిన మిలిటెంట్లు పేలుడు పదార్ధాలతో విధ్వంసం క్రియేట్ చేయడం, ఆర్మీ పికప్ ట్రక్కులపై దాడికి పాల్పడటం వంటి సీన్లు ఈ వీడియోలో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆపరేషన్ ‘‘స్ట్రాంగ్ పిల్లర్’’ పేరుతో ఈవిధంగా లైవ్ ఫైర్ ఎక్సర్‌సైజ్ ను హమాస్ ఉగ్రమూకలు చేశారని అంటున్నారు. హమాస్ టెర్రరిస్టులు లైవ్ ఫైరింగ్ ను ఎక్కడ ప్రాక్టీస్ చేశారు ? అనే దానికి కూడా సమాధానం దొరికిందని పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. శాటిలైట్ ఇమేజ్ ల విశ్లేషణ ఆధారంగా గాజా స్ట్రిప్ దక్షిణ తీరంలోని అల్-మవాసి వెలుపల ఉన్న ఎడారిలో హమాస్ ఈ ప్రాక్టీస్ చేసిందని అంటున్నారు. అక్టోబరు 7న జరిగిన దాడిలోనూ హమాస్ మిలిటెంట్లు ఇవే సీన్లను రిపీట్ చేశారు.
Also Read: IT Seizes 42 Crores : తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక డబ్బు..బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్
హమాస్ సోషల్ మీడియాపై నిత్యం డేగకన్ను వేసి ఉంచే ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్.. ఈ వీడియోను చూడలేదా ? చూసినా ఎందుకు అలర్ట్ కాలేదు ? అనే సందేహాలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఒకవేళ ఆనాడే మోసాద్ స్పందించి, ఇజ్రాయెల్ ఆర్మీని అలర్ట్ చేసి ఉంటే ఇంత ఘోర విపత్తు జరిగి ఉండేది కాదనే అభిప్రాయం రక్షణ రంగ నిపుణుల్లో వ్యక్తం అవుతోంది. హమాస్ దాడికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, సమయం అనేది.. ఆ సంస్థలోని కొద్దిమంది ముఖ్య కమాండర్‌లకు మాత్రమే తెలుసని, ఫలితంగా ఆ వివరాలు మోసాద్ దాకా చేరలేదని (Hamas Mock Ups) అంటున్నారు.