HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World
  • ⁄Excavating The Dead Bodies In Turkey Syria Countries

Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

ఇప్పటి వరకు మరణాల సంఖ్య 8 వేలు దాటింది. ఇంకా వేలాది మంది క్షతగాత్రులు ఉన్నారు.

  • By Balu J Published Date - 12:13 PM, Wed - 8 February 23
Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!

టర్కీ (Turkey), సిరియాను అతలాకుతలం చేసిన భూకంపం (Earthquake) లో కూలిన కట్టడాలను తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు (Dead bodies) బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 8 వేలు దాటింది. ఇంకా వేలాది మంది క్షతగాత్రులు ఉన్నారు. భూకంపంతో తల్లడిల్లిన ఆ రెండు దేశాలకు మానవీయ కోణంతో భారీగా సహాయం అందించే కార్యక్రమాన్ని భారత్ (India) వెనువెంటనే చేపట్టింది.  భారత్ నుండి బయల్దేరిన వైద్య, ఇతర వస్తు సామగ్రితో పాటు వైద్య సిబ్బంది, సైనికులు తుర్కియే కు నిన్న చేరుకున్నారు. ప్రత్యేకంగా అక్కడ 30 పడకల ఆస్పత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేసి వైద్య సహాయంపై భారత్ బృందాలు దృష్టి కేంద్రీకరించాయి. ఆరు టన్నుల వైద్య ఉపకరణాలు, మందులను భారత్ అక్కడకు చేరవేసింది.

టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి 47 మి.మీ చొప్పున ఆసియాలోకి వెళ్తోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీన్ని బట్టి భారతదేశం భూకంపాల (Earthquake) నుంచి సురక్షితం కాదని ఒక నివేదిక పేర్కొంది. దీనివలన ఆసియా, ఇంకా భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరమైన, అనూహ్యమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. దీనికోసం భారత్ సిద్ధంగా ఉండాలని గత నవంబర్ లో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇంక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే మార్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు. భారత్, యురేషియన్ ప్లేట్ ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని.. వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ (Ajay paul) తెలిపారు.

‘హిమాలయాల కింద వడకట్టిన శక్తి చేరడం వలన భూకంపాలు సంభవించడం అనేది సాధారణ ప్రక్రియ. మొత్తం హిమాలయ ప్రాంతంలో ప్రకంపనలు రావొచ్చు. అలాగే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. అయిన భూకంపం (Earthquake) ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేము. తదుపరి క్షణం, వచ్చే నెల, లేదా 100 తర్వాతైనా భూకంపాలు రావచ్చు’ అని అజయ్ అన్నారు. భారతదేశం (India)లో గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు వచ్చాయి. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో, 1950లో అస్సాంలో భూకంపాలు వచ్చాయి.

Also Read: SSMB 28 Update: మహేష్ బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు.. శరవేగంగా SSMB 28 షూటింగ్!

Telegram Channel

Tags  

  • dead bodies
  • Earthquake In Turkey
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

India Operation Dost: భారత్ సేవాదృక్పథానికి ప్రపంచం ఫిదా

India Operation Dost: భారత్ సేవాదృక్పథానికి ప్రపంచం ఫిదా

భారత్ (India) నిజమైన దోస్త్ అంటున్నారు టర్కీ ప్రజలు. కష్టకాలంలో అండగా నిలిచిన భారత (India) ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. భూప్రళయంతో కకావికలమైన టర్కీ, సిరియా సహాయక చర్యల్లో కీలక భూమిక పోషిస్తోంది ఇండియన్ ఆర్మీ. మన వైద్య బృందాలు అందిస్తున్న సేవలకు యావత్ ప్రపంచం హ్యాట్సాఫ్‌ చెబుతోంది.

  • Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 15 మంది మృతి

    Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 15 మంది మృతి

  • Milk Chemical: మీరు పాలు తాగుతున్నారా.. అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే..!

    Milk Chemical: మీరు పాలు తాగుతున్నారా.. అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే..!

  • China Corona: ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. శ్మశానాల్లో శవాలు మోసేవాళ్ళ రిక్రూట్మెంట్.. దడ పుట్టించేలా

    China Corona: ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. శ్మశానాల్లో శవాలు మోసేవాళ్ళ రిక్రూట్మెంట్.. దడ పుట్టించేలా

  • Shocking News: పాతబస్తీలో దారుణం.. శవాలను మింగేస్తున్న పాములు!

    Shocking News: పాతబస్తీలో దారుణం.. శవాలను మింగేస్తున్న పాములు!

Latest News

  • Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?

  • CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

  • Changes for Taxpayers: పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1 నుంచి మార్పులు

  • Ponniyin Selvan 2: నేలపై కత్తిని ఉంచి అందంగా కూర్చున్న ఐశ్వర్య.. పొన్నియిన్ సెల్వన్ 2 పోస్టర్‌ రిలీజ్.!

  • Indian Railway: రైల్వే పై దాడులు చేస్తే ఇక జైలుకే

Trending

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: