Building Fire: ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవదహనం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Building Fire) జరిగింది. ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు సమాచారం.
- Author : Gopichand
Date : 31-08-2023 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
Building Fire: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Building Fire) జరిగింది. ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు సమాచారం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. అగ్ని ప్రమాదంలో మరో 43 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకు 52 మృతదేహాలను భవనం నుంచి బయటకు తీశారు
తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ తెలిపారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని చెప్పారు. బృందం ఇప్పటివరకు 52 మృతదేహాలను బయటకు తీసిందని, ఇంకా ఎక్కువ మంది లోపల చిక్కుకొని ఉండవచ్చని ఆయన చెప్పారు.
Also Read: Black Rice Benefits: బ్లాక్ రైస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఈ సమస్యలు కూడా మాయం..!
నగరంలో నల్లగా మారిన భవనాల కిటికీల నుంచి పొగలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. షీట్లు, ఇతర పదార్థాలు కూడా కొన్ని కిటికీల నుండి బయట వేలాడుతున్నాయి. మంటల నుండి తప్పించుకోవడానికి ప్రజలు వాటిని ఉపయోగించారా లేదా వారి ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియలేదు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో సుమారు 200 మంది నివసిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.