Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం అందువల్లే వచ్చింది.. జెలెన్ స్క్కీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని లక్ష్యంగా చేసుకుని డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By News Desk Published Date - 10:28 PM, Fri - 25 April 25

Russia Ukraine War: ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోకు వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. తాజాగా.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Pahalgam Attack: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని లక్ష్యంగా చేసుకుని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి జెలెన్స్కీ బాధ్యత వహించాలి. లక్షలాది మంది మరణానికి అతను దోషి అని ట్రంప్ అన్నారు. ఇది కాకుండా, రష్యాతో వివాదాన్ని పరిష్కరించడానికి క్రిమియాను అప్పగించడానికి జెలెన్స్కీ నిరాకరించడాన్ని కూడా ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఉక్రెయిన్ మళ్లీ క్రిమియాను పొందగలదా అని ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. క్రిమియాలో చాలా మంది ప్రజలు రష్యన్ భాష మాట్లాడతారు. భవిష్యత్తులో క్రిమియా రష్యా నియంత్రణలోనే ఉంటుందని జెలెన్స్కీకి బాగా తెలుసు.. అది (క్రిమియా) చాలా కాలంగా రష్యాతోనే ఉందని అందరికీ తెలుసు. ఉక్రెయిన్ ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.
Also Read: Pahalgam Terror Attack : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి – సీఎం రేవంత్
ఉక్రెయిన్ నాటోలో చేరే విషయంపై ట్రంప్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరుతుందని తాను అనుకోవడం లేదని, నాటోలో చేరాలనే కీవ్ ఆకాంక్షలు రష్యాతో యుద్ధం చెలరేగడానికి ఒక కారణమని ట్రంప్ అన్నారు. రష్యాతో యుద్ధం ప్రారంభమవడానికి కారణం ఉక్రెయిన్ నాటోలో చేరడం గురించి మాట్లాడటం ప్రారంభించినందువల్లే.. ఈ వాదనను లేవనెత్తకపోతే అసలు ఇరు దేశాల మధ్య యుద్దం ప్రారంభం అయ్యేది కాదని ట్రంప్ అన్నారు.