US Vs Iran : ఇరాన్ ఆయుధాల నౌక వర్సెస్ అమెరికా.. నేవీ సీల్స్ మరణంపై కొత్త అప్‌డేట్
అయితే ఈ ఏడాది ప్రారంభంలో యెమన్ హౌతీలకు తరలిస్తున్న ఇరాన్ (US Vs Iran) ఆయుధాల షిప్‌ను సోమాలియా తీరంలో స్వాధీనం చేసుకునేందుకు అమెరికా నేవీ సీల్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
- By Pasha Published Date - 09:30 AM, Sat - 12 October 24

US Vs Iran : అమెరికాకు భారీ షాక్ తగిలింది. ఆ దేశ ఆర్మీలో అత్యంత కీలకమైన విభాగం.. నేవీ సీల్స్. వీరికి అందించే శిక్షణ టాప్ లెవల్‌లో ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో యెమన్ హౌతీలకు తరలిస్తున్న ఇరాన్ (US Vs Iran) ఆయుధాల షిప్‌ను సోమాలియా తీరంలో స్వాధీనం చేసుకునేందుకు అమెరికా నేవీ సీల్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ క్రమంలో ఒక నేవీ సీల్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మరొక నేవీ సీల్ సముద్రంలోకి దూకాడు. అయితే ఇద్దరు కూడా సముద్రంలో మునిగిపోయారు. పది రోజుల గాలింపు తర్వాత వారిద్దరూ చనిపోయారని అమెరికా ఆర్మీ ప్రకటించింది. సముద్రంలో పడిపోయిన సమయంలో వారి శరీరంపై అన్ని రకాల రెస్క్యూ కిట్స్ ఉన్నాయి. అయినా సముద్రంలో ఎలా మునిగిపోయారన్న మిస్టరీగా మారింది.
Also Read :Tamil Nadu Train Accident : గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్.. 19 మందికి గాయాలు, పట్టాలు తప్పిన 12 బోగీలు
సముద్రంలో మునిగిపోయే పరిస్థితే వస్తే.. అత్యవసర సాయం కోరేందుకు వారి శరీరంపై పరికరాలు ఉన్నాయి. వాటిని ఆ సైనికులు ఎందుకు ఉపయోగించలేదనే సందేహం తలెత్తుతోంది. వారి హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇద్దరు అమెరికా నేవీ సీల్స్ సిబ్బంది మరణంపై అమెరికా ఆర్మీ వాదన మరోలా ఉంది. వారిద్దరు ఎమర్జెన్సీ గేర్‌ను ఉపయోగించడంలో బాగా ప్రాక్టీస్ చేయలేదని తెలిపింది. సముద్రంలో మునిగిపోకుండా కాపాడే ఫ్లోటేషన్ సిస్టమ్ వారి శరీరంపై ఉన్నప్పటికీ.. ఆ ఇద్దరు నేవీ సీల్స్ ఒకసారి మాత్రమే ప్రయోగాత్మకంగా వాడారని పేర్కొంది. అందువల్ల ఎమర్జెన్సీలో వాడలేకపోయి ఉండొచ్చని అమెరికా ఆర్మీ పేర్కొంది. అమెరికా నేవీ ప్రమాణాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ కిట్లు లేకపోవడం వల్ల కూడా ఆ ఇద్దరు నేవీ సీల్స్ చనిపోయి ఉండొచ్చని తెలిపింది. అయితే అప్పట్లో అమెరికా నేవీ సీల్స్ అడ్డుకున్న ఇరాన్ ఆయుధాల నౌక ఏమైంది ? ఇరాన్ నౌకను అమెరికా నేవీ సీల్స్ అడ్డుకున్న తర్వాత ఏం జరిగింది ? అనే దానిపై పూర్తి క్లారిటీ వస్తే ఈ మరణాలపైనా స్పష్టత వస్తుంది.