Tamil Nadu Train Accident : గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్.. 19 మందికి గాయాలు, పట్టాలు తప్పిన 12 బోగీలు
చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొని గమ్యస్థానాలకు (Tamil Nadu Train Accident) బయలుదేరింది.
- By Pasha Published Date - 08:59 AM, Sat - 12 October 24

Tamil Nadu Train Accident : తమిళనాడులో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న మైసూరు – దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు (12578).. మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. ఆ లైనులో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్ రైలులోని దాదాపు 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లా కవరైప్పెట్టై రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో రైలులోని పవర్ కారు మంటల్లో చిక్కుకుంది. దాదాపు 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎవరూ చనిపోలేదని అంటున్నారు. ఈ ప్రమాదం జరిగిన టైంలో రైలులో మొత్తం 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక రైలును చెన్నై సెంట్రల్ నుంచి సంఘటనా స్థలానికి (కవరైప్పెట్టై రైల్వే స్టేషన్) పంపారు. అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకొని గమ్యస్థానాలకు (Tamil Nadu Train Accident) బయలుదేరింది. ప్రయాణికులకు ఉచితంగా ఆహారం, నీరు అందించారు.
Also Read :Indian Roller : దసరా రోజున ‘పాలపిట్ట’ ను ఎందుకు చూడాలో తెలుసా..?
“మైసూరు – దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఏపీలోని గూడూరు వైపు బయలుదేరింది. గూడ్స్ రైలు కూడా గూడూరు వైపే వెళ్లాల్సి ఉంది. ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండటంతో గూడ్స్ రైలును లూప్ లైన్‌లో పార్క్ చేశారు. ప్యాసింజర్ రైలుకు మెయిన్ లైనులో సిగ్నల్ ఇచ్చాం. అయినా అది లూప్ లైనులోకి వెళ్లి, వెనుక వైపు నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో వెంటనే ఇంజిన్ పట్టాలు తప్పింది. పైలట్, లోకో పైలట్ బాగానే ఉన్నారు’’ అని ఈ సంఘటన గురించి దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ RN సింగ్ వివరించారు. ఈ ఘటన కారణంగా ఇవాళ 18 రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో వేగంగా పని చేస్తోందని తెలిపారు. శనివారం సాయంత్రం వరకు ఈ మార్గంలో రైలు సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అంటున్నారు.
Also Read :Pomegranate Peel Tea : దానిమ్మ తొక్కతో టీ.. బోలెడు ప్రయోజనాలు..:!
హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇవే..
- చెన్నై డివిజన్ : 044 25354151, 044 25330952, 044 25330953, 044 24354995,
- సమస్తిపూర్ : 06274-81029188
- దర్భంగా : 06272-8210335395
- దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ : 7525039558