Cyanide Killings : ‘సైనైడ్ సైకో’కు మరణశిక్ష.. అప్పులు ఇచ్చిన 14 మంది ఫ్రెండ్స్ మర్డర్
గత ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బ్యాంకాక్‌లో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరిపర్న్ ఖన్వాంగ్, సారరట్ రంగ్‌సివుతాపర్న్(Cyanide Killings) కలిసి వెళ్లారు.
- By Pasha Published Date - 01:58 PM, Thu - 21 November 24

Cyanide Killings : సైనైడ్.. చాలా డేంజర్ పదార్థం. ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోతారు. తక్కువగా తీసుకున్నా ప్రాణాలకు డేంజర్. థాయ్‌లాండ్ మహిళ సారరట్ రంగ్‌సివుతాపర్న్ సైనైడ్‌తో 14 మంది స్నేహితులను వరుసగా మర్డర్ చేసింది. తాజాగా ఆమెకు థాయ్‌లాండ్ కోర్టు మరణశిక్ష విధించింది.
Also Read : Adani Shares Crash : ‘అదానీ’ షేర్లు ఢమాల్.. అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లూ డౌన్
సారరట్ రంగ్‌సివుతాపర్న్ అనే థాయ్‌లాండ్ మహిళ జూదం గేమ్‌కు బానిసగా మారింది. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి మరీ జూదం ఆడేది. తనకు అప్పు ఇచ్చినవారు బతికి ఉంటే.. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఆమె సీరియల్ మర్డర్స్ చేయడం మొదలుపెట్టింది. తనకు డబ్బును అప్పుగా ఇచ్చినవారు.. తిరిగి డబ్బు అడిగితే వారిని చంపేసే రాక్షస క్రీడను ప్రారంభించింది. సిరిపర్న్ ఖన్వాంగ్ అనే తన ఫ్రెండ్ నుంచి సారరట్ రంగ్‌సివుతాపర్న్ అప్పు చేసింది. అయితే కొన్ని నెలల తర్వాత తనకు డబ్బులు అవసరం ఉన్నాయని.. వాటిని తిరిగి ఇచ్చేయాలని సిరిపర్న్ ఖన్వాంగ్ అడిగింది. అయితే ప్రస్తుతం డబ్బులు లేవని.. వచ్చాక ఇస్తానని సారరట్ రంగ్‌సివుతాపర్న్ బుకాయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో పశ్చిమ బ్యాంకాక్‌లో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరిపర్న్ ఖన్వాంగ్, సారరట్ రంగ్‌సివుతాపర్న్(Cyanide Killings) కలిసి వెళ్లారు. ఈక్రమంలో ప్రయాణం చేస్తూ ఆహారం తిన్న వెంటనే సిరిపర్న్ ఖన్వాంగ్ కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. అయితే సిరిపర్న్ ఖన్వాంగ్ మరణించిన తీరుపై ఆమె కుటుంబీకులు డౌట్ వెలిబుచ్చారు. పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read :Meeto Mee Chandrababu : సంక్రాంతి నుంచి ‘మీతో మీ చంద్రబాబు’.. మోడీ ‘మన్ కీ బాత్’ తరహాలో కార్యక్రమం
పోలీసులు దర్యాప్తులో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించారు. సిరిపర్న్ ఖన్వాంగ్ చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు తేలింది. సిరిపర్న్ ఖన్వాంగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. కనీసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించే ప్రయత్నాన్ని కూడా సారరట్ రంగ్‌సివుతాపర్న్ చేయలేదని గుర్తించారు. సిరిపర్న్ ఖన్వాంగ్ డెడ్‌బాడీకి నిర్వహించిన పోస్టుమార్టంలో ఇంకో అత్యంత ముఖ్య సమాచారం బయటికి వచ్చింది. ఆమె డెడ్‌బాడీలో సైనైడ్ ఆనవాళ్లను వైద్యులు నిర్ధారించారు. అనంతరం సారరట్ రంగ్‌సివుతాపర్న్‌ను కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేయగా.. ఇంకొన్ని విషయాలు చెప్పింది. అయితే తాను నిర్దోషినని బుకాయించింది. సారరట్ రంగ్‌సివుతాపర్న్‌కు చెందిన మరో 13 మంది స్నేహితులు ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో గతంలో చనిపోయారు. వాటిపైనా పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో వారందరికీ ఆహారంలో లేదా డ్రింక్స్‌లో సైనైడ్‌ను కలిపి సారరట్ రంగ్‌సివుతాపర్న్ ఇచ్చిందని తేలింది. మొత్తం 14 మంది సీరియల్ కిల్లింగ్స్‌లో సారరట్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.