Meeto Mee Chandrababu : సంక్రాంతి నుంచి ‘మీతో మీ చంద్రబాబు’.. మోడీ ‘మన్ కీ బాత్’ తరహాలో కార్యక్రమం
ఆడియో/ వీడియో(Meeto Mee Chandrababu) రెండు మాధ్యమాల్లోనూ ‘మీతో మీ చంద్రబాబు’ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 12:22 PM, Thu - 21 November 24

Meeto Mee Chandrababu : ‘మన్ కీ బాత్’.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలతో మనసు విప్పి మాట్లాడే అద్భుతమైన కార్యక్రమం ఇది. దీన్ని ప్రతినెలా చివరి ఆదివారంలో నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రధాని మోడీ సందర్భోచితంగా వివిధ అంశాలపై మాట్లాడుతారు. అచ్చం ఇదే తరహా ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. దాని ద్వారా ఏపీ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు, జరుగుతున్న పురోగతి గురించి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు.
Also Read :BPCL Oil Refinery: ఏపీలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ
2025 జనవరిలో సంక్రాంతి పండుగ నుంచి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించే అవకాశం ఉంది. చంద్రబాబు చేపట్టనున్న కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే.. ఒక ఫోన్ నంబరును ఇచ్చి దానికి కాల్ చేసే ప్రజలతోనూ ఆయన మాట్లాడనున్నారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకోనున్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ‘‘మీతో మీ చంద్రబాబు’’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియో/ వీడియో(Meeto Mee Chandrababu) రెండు మాధ్యమాల్లోనూ ‘మీతో మీ చంద్రబాబు’ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రజలతో ముఖాముఖిగా సమావేశాలు నిర్వహిస్తానని ఇటీవలే అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. బహుశా ఆ వ్యాఖ్యలు.. జనవరి నుంచి జరగబోయే ‘మీతో మీ చంద్రబాబు’ కార్యక్రమానికి సంకేతమై ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Also Read :Arrest Warrants On Adani : గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో కేసు.. అరెస్టు వారెంట్ జారీ ?
సీఎం హోదాలో చంద్రబాబు ప్రజలతో ఈవిధంగా ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇంటరాక్ట్ కావడం అనేది ఇదే తొలిసారేం కాదు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న టైంలో (1995-2004 మధ్య) ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. దేశ రాజకీయాల్లో కొత్త విప్లవానికి నాంది పలికింది. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఆనాడు చంద్రబాబును ఫాలో అవుతూ తమ రాష్ట్రాల ప్రజలతో ఇంటరాక్టివ్ కార్యక్రమాలను నిర్వహించారు.