Dawood Ibrahim: విషం తాగి కరాచీలో ప్రాణాలతో పోరాడుతున్న దావూద్ ఇబ్రహీం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతను విషం తాగి పాకిస్థాన్‌లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు చెప్తున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 18-12-2023 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతను విషం తాగి పాకిస్థాన్‌లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే దీనిపై పాకిస్థాన్ మీడియా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడం అనుమానాలకు దారి తీస్తుంది. పైగా అక్కగా నిన్నటి నుంచి ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసిందట.
1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు బాధ్యుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ కట్టుదిట్టమైన భద్రతతో ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ పరిణామాలు ఏవీ అధికారికంగా ధృవీకరించబడలేదు. కరాచీ ఆసుపత్రిలో చేరిన దావూద్ ఇబ్రహీం గత దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడని, 1993లో 250 మందికి పైగా మరణించిన, వేలాది మంది గాయపడిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం. అయితే ప్రస్తుతం అతను కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని భారత అధికారులు విశ్వసిస్తుండగా, పాకిస్థాన్ దానిని ఖండించింది. జనవరి 2023లో, అతను పాకిస్తాన్‌లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడని మరియు కరాచీలో నివసిస్తున్నాడని అతని మేనల్లుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చాడు.
దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ ముంబైలో నేర కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడని ఇంటిలిజెన్స్ విభాగం అభిప్రాయపడుతోంది. పాకిస్తాన్‌లో అతను మైజాబిన్ అనే పాకిస్తానీని వివాహం చేసుకున్నాడని మరికొందరు విశ్వసిస్తున్నారు. కాగా ప్రస్తుతం అతను విషప్రయోగంతో కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Also Read: Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ