China’s Big Warning : USతో ఒప్పందం చేసుకునే దేశాలకు చైనా హెచ్చరిక
China's Big Warning : యూఎస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్న ఆ దేశాలు తమకు నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తే, అవి తీవ్రంగా పరిగణించబడతాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది
- By Sudheer Published Date - 11:08 AM, Mon - 21 April 25

ప్రపంచవ్యాప్తంగా అమెరికా(US)తో ట్రేడ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో చైనా (China) తన ప్రతికూలతలను బలంగా వ్యక్తం చేస్తుంది. యూఎస్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకున్న ఆ దేశాలు తమకు నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తే, అవి తీవ్రంగా పరిగణించబడతాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనా… ఈ ఒప్పందాలపై ప్రతీకార చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా చైనా ఈ చర్యలను ఇతర దేశాలకు హెచ్చరికగా తెలిపింది., ముఖ్యంగా ఆ దేశాలు అమెరికాతో ఎకానమిక్ ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తే చర్యలు తప్పవని చెప్పకనే చెప్పింది.
JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్..సాయంత్రం ప్రధానితో భేటీ
తాజాగా బీజింగ్ నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం.. యూఎస్ అగ్రరాజ్యంతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకునే దేశాలకు చైనా తీవ్రమైన ఆర్థిక ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. యూఎస్ నుంచి ఒప్పందం చేసుకున్న దేశాలపై చైనా ప్రతికార చర్యలు తీసుకుంటుందని అంగీకరించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తూ, చైనా తన ఆర్థిక సంబంధాలను తెంచుకుంటే, అది మరింత తీవ్రతకు చేరుకుంటుందని వారు హెచ్చరించారు. అమెరికా యూఎస్‌ను ప్రోత్సహిస్తూ, చైనా పెరిగిన టారిఫ్ లను తగ్గించి కొన్ని దేశాలకు ఉపశమనం కల్పిస్తుందని వెల్లడించాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.