China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం
తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను(China Halts Foreign Adoptions) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
- By Pasha Published Date - 01:04 PM, Sat - 7 September 24

China Halts Foreign Adoptions : ఒకప్పుడు చైనాలో కుటుంబ నియంత్రణ ప్రణాళికలు పక్కాగా అమలయ్యాయి. ఒకరు లేదా ఇద్దరికి మించి పిల్లలను కనకూడదనే నిబంధనలను చైనా సర్కారు తు.చ తప్పకుండా అమలు చేసింది. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాల తర్వాత చైనాలో జనాభా తగ్గిపోయింది. దీంతో ఆ దేశం ఆలోచన మళ్లీ మారిపోయింది. ఇప్పుడు జనాభాను పెంచడంపై చైనాలోని చాలా ప్రావిన్సులు ప్రత్యేక ఫోకస్ చేస్తున్నాయి. ఇందుకోసం నవ దంపతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా చైనా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Kamala Harris Husband Comments : కమలను డిబేట్‌లో ఓడించడం అసాధ్యం.. భర్త డగ్లస్ కామెంట్స్
దేశంలో జనాభాను మళ్లీ పెంచేందుకు చైనా సర్కారు ప్రస్తుతం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటిదాకా చైనాకు చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే విషయంలో పెద్దగా కఠినమైన రూల్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఈవిషయంలో చైనా వైఖరిని మార్చుకుంది. తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను(China Halts Foreign Adoptions) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చైనా పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చేందుకు అనుమతించే పథకం గత మూడు దశాబ్దాలుగా(1992 సంవత్సరం నుంచి) అమలవుతోంది. చైనా సర్కారు తాజా నిర్ణయంతో ఆ పథకానికి తెరపడింది.
Also Read :Terror Attack Plot : న్యూయార్క్‌లో యూదులపై ఉగ్రదాడికి స్కెచ్.. పాకిస్తానీయుడి అరెస్ట్
1992 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 1.60 లక్షల మంది చైనా పిల్లలను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు దత్తత తీసుకున్నారు. ఈవివరాలను చైనీస్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. చైనా నుంచి మొత్తం 1.60 లక్షల మంది పిల్లలను విదేశీయులు దత్తత తీసుకోగా.. వారిలో 82 వేల మందిని అమెరికా కుటుంబాలే దత్తత తీసుకోవడం గమనార్హం. వారిలో ఎక్కుమంది బాలికలే ఉన్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుతం దత్తత ప్రక్రియ మధ్యలో ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం పడదని చైనా సర్కారు స్పష్టం చేసింది.