Blacklist Mir: 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడిని చైనా కాపాడే ప్రయత్నం
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించింది.
- By Praveen Aluthuru Published Date - 08:50 PM, Tue - 20 June 23

Blacklist Mir: 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించింది. అయితే దీనికి చైనా అడ్డుగా నిలిచింది. మరోసారి చైనా తన వక్రబుద్ధి ప్రదర్శించింది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా మంగళవారం అడ్డుకుంది.
సాజిద్ మీర్ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో ప్రముఖ పాత్ర పోషించాడు, ఇక సాజిద్ మీర్ తల కోసం గతంలో అమెరికా 5 మిలియన్ల అమెరికా డాలర్లను బహుమతిగా ప్రకటించింది.
Read More: New Parties in AP : కొత్త పార్టీల వెనుక బూచోడు?